'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి' అనే సినిమా డైలాగ్ కూడా సరిపోదేమో. అంతలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది పుష్ప-2. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అంతేకాకుండా ఓవర్‌సీస్‌లో ఏ భారతీయ సినిమా సాధించని అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సాధించింది.
తాజాగా మరో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది ఐకాన్ స్టార్ మూవీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాలుగా నిలవనుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫ్యాన్స్ కోసం ఒక రోజు ముందే బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు.
#Pushpa2TheRule crosses the 100 CRORES mark with advance bookings 💥💥💥
THE BIGGEST INDIAN FILM is on a record breaking spree ❤🔥#RecordsRapaRapAA 🔥🔥#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/vTBhiy18oB— Pushpa (@PushpaMovie) December 3, 2024
Comments
Please login to add a commentAdd a comment