అనతి కాలంలోనే ఇండియన్ కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన కియా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. 2022 జూన్ 2న కారును మార్కెట్‌లో రిలీజ్ చేయబోతుంది కియా. దీంతో ఆన్‌లైన్‌లో ఆడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. కియా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ముందస్తుగా కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ 6ను బుక్ చేసుకోవచ్చు. టోకెన్ అమౌంట్‌గా మూడు లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
కియా సంస్థ ఇటీవల ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈవీ 6 పేరుతో ఈ మోడల్‌ను రిలీజ్ చేయనుంది. ఈవీ కారులో 77.4 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 528 కిలోమీటర్లు ప్రయాణం చేయోచ్చని కియా చెబుతోంది. 5.2 సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడును ఈ కారు అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 192 కిలోమీటర్లు. కియా ఈవీ 6 ధర రూ.60 లక్షల వరకు ఉంచవచ్చని అంచనా. 18 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవుతుంది.
లార్జ్ బూట్ స్పేస్, పెద్దదైన సన్‌రూఫ్, ఎల్లాయ్‌వీల్స్, అధునాత టెయిల్ ల్యాంప్ సిస్టమ్, లెటెస్ట ఇన్ఫోంటైన్ సిస్టమ్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ హెడ్‌అప్ డిస్‌ప్లే, ఆల్‌వీల్ డ్రైవ్, నార్మల్, స్పోర్ట్స్, ఎకో డ్రైవింగ్ మోడ్స్, ఈవీ రిమోట్ ఛార్జింగ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ మానిటరింగ్, ఈవీ రిమోట్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు. ఈవీ 6 మోడల్‌లో జీటీ లైన్, జీటీ లైన్ ఏవీడీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..?
Comments
Please login to add a commentAdd a comment