‘టైటానిక్‌’ రీ–యూనియన్‌ | James Cameron Explains How He’s Shooting Underwater Mo-Cap for ‘The Avatar Sequels’ | Sakshi
Sakshi News home page

‘టైటానిక్‌’ రీ–యూనియన్‌

Published Mon, Dec 11 2017 12:15 AM | Last Updated on Mon, Dec 11 2017 12:15 AM

James Cameron Explains How He’s Shooting Underwater Mo-Cap for ‘The Avatar Sequels’ - Sakshi

‘‘జేమ్స్‌ కేమరూన్‌ సినిమాలో మళ్లీ నటించే అవకాశం వస్తే మాత్రం ఈసారి ఎక్కువ రెమ్యునరేషన్‌ అడుగుతా!’’ 20 ఏళ్ల క్రితం, తన 22 ఏళ్ల వయసులో కేట్‌ విన్‌స్లెట్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇది. ‘టైటానిక్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయిన సందర్భంగా అందులో నటించిన కేట్, ఆ సినిమా దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌తో సినిమా అంటే ఏ స్థాయిలో కష్టపడాలో చెబుతూ సరదాగా ఈ మాట అన్నారు. ‘టైటానిక్‌’ 1997లో విడుదలైతే.. ఈ ఇరవై ఏళ్లలో కేట్‌ విన్‌స్లెట్‌  చాలా సినిమాల్లో నటించి, తిరుగులేని స్టార్‌డమ్‌ సంపాదించుకున్నారు.

మరోపక్క దర్శకులకే ఒక మార్గదర్శకుడు, వరల్డ్‌ పాపులర్‌ డైరెక్టర్‌గా ఎదిగిన జేమ్స్‌ కేమరూన్‌ మాత్రం ఈ ఇరవై ఏళ్లలో ఒకే ఒక్క సినిమా తీశారు. అదీ 2009లో వచ్చిన సినిమా వండర్‌ ‘అవతార్‌’. ‘అవతార్‌’ విడుదలైన ఇన్నేళ్లకు ఆ సినిమాకు నాలుగు సీక్వెల్స్‌ రెడీ చేస్తోన్న కేమరూన్‌ ప్రస్తుతం ‘అవతార్‌ 2’ పనులను మొదలుపెట్టేశారు. మరి రెమ్యునరేషన్‌ తన మార్కెట్‌ కంటే ఎక్కువే అడిగారో లేదో కానీ కేట్‌ విన్‌స్లెట్‌ ‘అవతార్‌ 2’లో నటిస్తున్నారు. అయితే ఇందులో ఆమెది కీ రోల్‌ మాత్రమే! కథను మలుపు తిప్పే పాత్రట. ఈ సినిమా కోసమే ప్రస్తుతం డైవింగ్‌ కూడా నేర్చుకుంటున్నారు కేట్‌! 2020 డిసెంబర్‌లో ‘అవతార్‌ 2’ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement