నటి, నిర్మాత చార్మీ కౌర్‌కి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. తను పెంచుకుంటున్న కుక్కపిల్లని కొడుకుగా భావిస్తుంది చార్మి. తన పెట్ చేసే అల్లరిని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఆ ఫోటోలు వైరల్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే పెట్స్ ప్రేమని రష్మికకు కూడా రుద్దింది చార్మీ.
రష్మిక మందన్నా ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్, సిద్దార్త్ మల్హోత్ర సినిమాలతో ఫుల్ సందడి చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ నిమిత్తం తాజాగా ఆమె ముంబైలో వెళ్లిన రష్మిక.. అక్కడే మకాం వేసిన చార్మీ వద్దకు వెళ్లింది.
ఈ సందర్భంగా రష్మికకు ఓ పెట్‌ను దత్తత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చార్మి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ‘ఐటమ్‌ని ఆరా కలిసినప్పుడు.. కంగ్రాట్స్ రష్మిక.. మీ బిడ్డ ఎంతో బాగుంది. మా ముంబైకి స్వాగతం’అని పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ.. థ్యాంక్యూ ఛార్మీ, ఇకపై ఎప్పుడూ నన్ను అక్కడే చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంతకి ఐటమ్, ఆరా ఏంటి అనుకుంటున్నారా? చార్మీ పెంపుడు కుక్క పేరు ఐటమ్, రష్మిక పెట్ పేరు ఆరా. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి:
Pawan Kalyan: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..‘వకీల్ సాబ్’ మళ్లీ వస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment