కొంతమంది జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏమైనా అయితే ఏ మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో మనుషులు అమితమైన ప్రేమ కనబరుస్తుంటారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) కూడా అంతే. ఆయనకు కుక్కలు అంటే చాలా ఇష్టం. చాలా కుక్కలను ఆయన పెంచుకున్నారు. గతంలో అనేకసార్లు తన పెంపుడు కుక్కలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఆయన హఠాన్మరణంతో లక్షలాది అభిమానులతో పాటు ఆ పెంపుడు శునకాలు కన్నీంటి పర్యంతమవుతున్నాయి.
అప్పు ఇక రాలేడనే విషయం తెలియక.. ఆయన ఫోటో ముందుకెళ్లి దీనంగా ఏడుస్తూ కుర్చుంటున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెంటుకుంటున్నారు. పునీత్ కనిపించకపోవడంతో అవి ఆహారం కూడా తీసుకోవడం లేదట. పునీత్ ఇక రాలేడనే విషయం వాటికి ఎలా చెప్పాలో తెలియక.. చివరికి రాజ్‌కుమార్ సమాధి వద్దకు ఆ కుక్కలను తీసుకెళ్లారు. గతేడాది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు ఆయన పెంపుడు కుక్క కూడా వారం రోజుల పాటు ఏమీ తినకుండా అనారోగ్యం పాలైంది. చివరికి వాళ్ల కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప అది ప్రాణాలతో బయట పడలేదు. మరి రాజ్‌కుమార్ శునకాలు ఎప్పుడు మాములు పరిస్థితి వస్తాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment