ట్వింకిల్ ఖన్నా
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్స్ ఫొటోలు షేర్ చేసి జంతువుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. అంతేకాదు వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు ట్వింకిల్. తన పెంపుడు కుక్క, పిల్లుల ఫొటోను షేర్ చేసి.. వేర్వేరు జాతులకు చెందిన కుక్క, పిల్లులే కలిసి ఉన్నపుడు మనుషులు మాత్రం ఎందుకు కలిసి ఉండకూడదంటూ ప్రశ్నిస్తున్నారు.
నిజమే కదా చిన్న చిన్న విషయాలకే గొడవ పడే భార్యాభర్తలు ఈ పోస్ట్‌ను చూసి ట్వింకిల్ సలహాను పాటిస్తే ఏ గొడవా ఉండదు. తనకు, పిల్లులకు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు భావిస్తారట ట్వింకిల్. ఎక్కడికి వెళ్లినా ఆమెకు పిల్లులు ఎదురవటంతో తాను ‘మురకామి పుస్తకం’లో ఉన్నానా అన్పిస్తుందటూ.. క్యాట్ పర్సన్ అనే హాష్ ట్యాగ్‌తో మరో పోస్ట్ చేశారు.
అంతేకాకుండా తన ఫామ్ హౌజ్‌కు విచ్చేసిన అనుకోని అతిథుల ఫొటోలు కూడా షేర్ చేశారు. ‘నన్ను, నా ఇద్దరు పిల్లల్ని చూడటానికి తన ఇద్దరు పిల్లలతో నెమలి వచ్చింది.. కానీ వారి గురించి జడ్జ్ శర్మ చేసిన వ్యాఖ్యల గురించి అడగటం మరచిపోయా’నంటూ సరదాగా చెప్పుకొచ్చారు రచయితగా దూసుకెళ్తున్న ట్వింకిల్. వైవిధ్యమైన ఫొటోలు షేర్ చేయాలి, ఇన్‌స్టాగ్రామ్ అవార్డు పొందాలనుకుంటే ఆలస్యం చేయకుండా ట్వింకిల్ వద్ద ఇంటర్న్‌షిప్ చేసేయండి మరి.
Comments
Please login to add a commentAdd a comment