
బాలీవుడ్ : సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తోంది సోషల్ మీడియా. సినిమా, క్రీడా ప్రముఖలు చాలామంది తమ భావాలను, అనుభూతులను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి, రైటర్ ట్వింకిల్ ఖన్నా ఆదివారం ఉదయం తన దినచర్యకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన భర్త అక్షయ్ కుమార్ ఆటో డ్రైవ్ చేస్తుండగా, ట్వింకిల్ వెనకాల కూర్చోన్న ఫొటోను షేర్ చేశారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
‘ఉదయం పూట నాలుగు గంటలకు లేచి, రెండున్నర గంటల పాటు ప్రశాంతంగా పుస్తక రచన చేశాను. ఆ తర్వాత నా డాగ్‌ని తీసుకుని వాకింగ్‌కి వెళ్లాను, ఆ తర్వాత ఇలా నా క్యూట్ డ్రైవర్‌తో, ఆటో రిక్షాలో సరదాగా విహరించాను. ఇవన్నీ తొమ్మిది గంటల్లోపే పూర్తయ్యాయి. తొందరగా నిద్రపోవడం వల్లే ఇది సాధ్యమైంది. మీరు కూడా ట్రై చేయండి’ అని ఈ ఫొటోను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఒక అక్షయ్‌కి మాత్రమే సాధ్యపడుతుందని ఒకరు, క్యూట్ కపుల్ అని మరొకరు.. కామెంట్లు చేస్తున్నారు.