వేరే గ్రహాల మనుషుల్లా కనిపిస్తున్నారా? ప్లాస్టిక్ బుడగబంతుల్లో ఫుట్‌బాల్ ఆడుతున్నారంతే! జపాన్ రాజధాని టోక్యోలోని ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎమర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నొవేషన్’ దగ్గరి దృశ్యమిది. గాలిబుడగలో తేలుతున్న మజా అనుభవిస్తూనే ఫుట్‌బాల్‌నూ ఆస్వాదించే గేమ్ ఇది. నార్వేలో ప్రాణం పోసుకున్న ఈ కొత్త ఆట ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఈజిప్ట్, లెబనాన్, స్వీడన్, స్పెయిన్ లాంటి దేశాలకూ పాకింది, భారత్‌నూ తాకింది.
పెద్దల కోసం పరుగు
కంబోడియాలో ఏటా జరిగే షమ్ బెన్ పండగలోని దృశ్యం ఇది. యముడిని ఉద్దేశించిన వేడుక ఇది. ఖ్మేర్ క్యాలెండర్ ప్రకారం పదో నెలలో పదిహేను రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో కంబోడియావాసులు తమ ఏడుతరాల పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు. ఈ పక్షం రోజులు నరకపు ద్వారాలు తెరిచివుంటాయనీ, ప్రేతాత్మలు చురుగ్గా ఉండటం వల్ల ఆకలిగొనివుంటాయనీ, కాబట్టి వాటికి తగిన ఆహారాన్ని అందించాలనీ చెబుతారు. వేడుకల చివరిరోజున ఇలా దున్నల పరుగులో ఉత్సాహంగా పాల్గొంటారు.
విస్తరించిన కుటుంబం
తాము అనుభవించే సౌఖ్యం తమవారికీ అందించాలనుకోవడం ఎవరికైనా సహజం. మరి ఇంటిసభ్యుల్లా కలిసిపోయే పెంపుడు జంతువులను ఎలా విస్మరించగలం? అలాంటి యజమానుల కోసమే ఇటీవలే సింగపూర్లో ప్రారంభమైన విలాసవంతమైన హోటల్ ఇది. వాగింగ్టన్ లగ్జరీ పెట్ హోటల్‌లో పెంపుడు జంతువుల వ్యాయామం, గార్డెన్ నడక కోసం కూడా సదుపాయాలున్నాయి. ఎముక ఆకారంలో నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌లో కుక్కను ఈతకొట్టిస్తున్న హోటల్ ఉద్యోగిని చిత్రంలో చూడొచ్చు.
బుడగల ఫుట్‌బాల్
Published Sun, Nov 30 2014 1:00 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement