ఆత్మీయ నేస్తం – అందమైన ఇల్లు? | Spiritual Nation - Beautiful House? | Sakshi
Sakshi News home page

ఆత్మీయ నేస్తం – అందమైన ఇల్లు?

Published Sun, Jul 2 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

ఆత్మీయ నేస్తం – అందమైన ఇల్లు?

ఆత్మీయ నేస్తం – అందమైన ఇల్లు?

సెల్ఫ్‌ చెక్‌

పెంపుడు జంతువులు ఇంట్లో తిరుగుతుంటే ముచ్చటగానూ, ఆత్మీయ నేస్తం అంటిపెట్టుకుని ఉన్నట్లు ఉంటుంది. అయితే వాటిని పెంచుకుంటూ ఇంటిని అందంగా ఉంచుకోవడం గృహిణికి పరీక్ష.

1.    ఫర్నిచర్‌ను పెంపుడు జంతువులు గోళ్లతో గీరుతుంటాయి కాబట్టి క్రమం తప్పకుండా గోళ్లను కత్తిరిస్తుంటారు.
ఎ. అవును     బి. కాదు

2.మొక్కల మొదళ్లను, మట్టిని పెట్‌ యానిమల్స్‌ కదిలించి పాడు చేయకుండా కుండీలలో అందంగా కనిపించే రాళ్లను అమరుస్తున్నారు.
ఎ. అవును     బి. కాదు

3.    సోఫాల సందుల్లో ఉండిపోయిన వెంట్రుకలను చేతులకు లేటెక్స్‌ గ్లవ్స్‌ వేసుకుని ఫర్నిచర్‌ మీద ఒకే డైరెక్షన్‌లో రుద్దినట్లు తుడిస్తే మొత్తం వచ్చేస్తాయి. లేదా  క్లాత్‌ను తడిపి తుడవాలి.
ఎ. అవును     బి. కాదు

4.    కార్పెట్‌ మీద చిక్కుకున్న పెంపుడు జంతువుల బొచ్చును వ్యాక్యూమ్‌ క్లీనర్‌కు బదులుగా స్పాంజ్‌తో పని పూర్తి చేయవచ్చు.
ఎ. అవును     బి. కాదు

5.    పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయిస్తున్నారు.
ఎ. అవును     బి. కాదు

6.    నియమిత వేళల్లో ఆహారాన్ని ఇవ్వడం, ప్రకృతి అవసరాలను తీర్చుకోవడంలో క్రమ పద్ధతిని అలవాటు చేశారు.
 ఎ. అవును     బి. కాదు

7.    ఇల్లంతా తిరుగుతూ, దూకుతూ కిచెన్‌లో ప్రమాదాలు కలిగించకుండా శిక్షణనిచ్చారు. ప్రమాదకరమైన ఫీట్లు చేసినప్పుడు ముఖం మీద నీటిని స్ప్రే చేస్తే తిరిగి ఆ పనిని చేయవు.
ఎ. అవును     బి. కాదు

8.    పెట్‌ యానిమల్స్‌ తడిసినప్పుడు, చెవి ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి తడి లేకుండా ఒంటిని తుడవడం, డాక్టర్‌ సలహా తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరు.
ఎ. అవును     బి. కాదు

సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పెట్‌ యానిమల్స్‌ను ప్రేమగా పెంచుకుంటూనే ఇంటిని అందంగా ఉంచుకోవడంలో మీకు అవగాహన ఉంది. ‘బి’లు ఎక్కువైతే మీరు మరికొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇవి ఇంటిని కీకారణ్యం చేసేస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement