
మీ పెట్‌కి పెట్టేది ఆర్గానిక్ ఫుడ్డేనా?!
పెటానిక్
ఆర్గానిక్ మేనియా మన దగ్గరే కాదు ప్రపంచమంతా హల్‌చల్ చేస్తోంది. మన ఆరోగ్యం బాగుంటే చాలా! మనం అమితంగా ప్రేమించే పెట్స్ మాటేమిటి? అని కూడా యావత్ ప్రపంచం ఆలోచన చేస్తోంది. దాని ఫలితంగానే పెట్స్ కూడా ప్రతిపూటా ఆర్గానిక్ భోజనం రెడీ అవుతోంది. దాంతో పెట్ ఇండస్త్రీస్ అన్నీ ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీకి తెగ హైరానా పడిపోతున్నాయి. కుటుంబంలో అత్తా–మామ, అన్న–తమ్ముడు, కొడుకు– కోడలు సరసన ఇప్పుడు డైనింగ్ టేబుల్ వద్ద పెట్‌కీ ఓ కుర్చీ తప్పనిసరిగా ఉంటోంది. దీన్నిబట్టి పెంపుడు జంతువులకు మనవారు ఇచ్చే ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో అర్థమైపోతోంది! మనుషులమైన మనం మన ఆరోగ్యానికి ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార ఉత్పత్తుల కోసం శ్రద్ధ పెట్టగా లేనిది ప్రేమగా చూసుకునే పెట్స్‌కి పెట్టే తిండి గురించి ఎందుకు పట్టించుకోకూడదు అనుకుంటున్నారు పెట్ లవర్స్. ఈ ఆలోచన మనదే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్ లవర్స్‌ది. దీంతో పెట్ మార్కెట్‌లో ఆర్గానిక్ సందడి పెరిగింది. పెట్ ప్యాకేజ్డ్ ఫుడ్ మీద ఉండే లేబుల్స్‌ని నిశితంగా çపరిశీలిస్తున్నారు.
వినియోగదారుల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి ఆర్గానిక్ ఉత్పత్తులు పెట్స్ కోసం మార్కెట్లో కొలువుదీరడంలో పోటీ పడుతున్నాయి. ‘పెట్స్ ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ధర కీలకమైనది’ అంటారు బార్న్స్ పెట్ ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఆపరేటర్ రాచెల్ షెర్మని, బరోన్స్ మార్కెట్ ఆపరేటర్ శాన్ డియోగో! ‘ప్రజలు పెట్స్‌ని ప్రేమిస్తారు. అందుకే వాటికోసం ధనాన్ని వెచ్చించడానికి సిద్ధపడతారు. అయితే, ఆ ధనం అత్యంత విలువైనదిగా భావిస్తారు. ఉత్పత్తులు నాణ్యమైనవి కావాలనుకుంటారు’ అని వివరిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పెట్ ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీలో చాలా వరకు కంపెనీలు చవక నుంచి నాణ్యమైనవి తీసుకువస్తున్నాయి.
పది–పదిహేనేళ్ల క్రితం తాము ఏం తినేవారో వాటినే పెట్స్‌కి పెట్టేవారు.
అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. తాము ఏమి తిన్నా, ఎలా తిన్నా పెట్స్ కోసం మాత్రం క్వాలిటీ ఫుడ్‌ని వెతికి, అమర్చి పెట్టే వారి సంఖ్య పెరిగింది. పెట్స్ పట్ల మనుషుల్లో ఉండే మానవతావాదం, పెంచుకున్న ప్రేమ ఈ రెండూ పెట్ ఇండస్ట్రీ మార్కెట్ విస్తృతిని పెంచుతున్నాయి. ఫోనిక్స్ బేస్డ్ పెట్ ప్రొడక్ట్స్ రిటెయిలర్ ఎవ్వెయా డెవిస్ ‘అవధులు దాటిని ప్రేమ పెట్స్‌ని జాగ్రత్తగా చూసుకునేలా చేస్తోంది. ఈ ప్రేమే సహజసిద్ధమైన, సేంద్రీయ, అత్యంత నాణ్యమైన ఆహార ఉత్పత్తుల సంఖ్యా పెరిగేలా చేస్తోంది’ అంటారు. ఈ విధానం వల్ల పెట్స్ ఆరోగ్యమూ పెరిగింది. అయితే, ఇదే సమయంలో నేచురల్ పెట్ ఫుడ్ రేషియో గణనీయంగా పెరిగింది. ఎంతగా అంటే గతంలో ఏడాదికి 3–4 శాతం ఉండే రేషియో ఈ పదేళ్లుగా పది శాతానికి పైగా పెరిగింది. పెట్ ప్రొడక్ట్స్ మార్కెట్ సర్వేలో 50 శాతం వినియోగదారులు ఇది నిజమే అని తమ అంగీకారం తెలిపారు.
ఎవరికి వారు ప్రేమగా తయారీ
‘పెట్స్ కోసం కొనుగోలు చేసే బ్రాండెడ్ ఆర్గానిక్ ఉత్పత్తుల నుంచి తామే సొంతంగా పెట్స్‌కి ఆహారం తయారుచేయడం కోసం గ్లుటెన్ ప్రీ ఫుడ్స్ ఉపయోగించడం, గడ్డి తినిపించడం, ప్రొటీన్లు పుష్కలంగా లభించే పదార్థాలను సేకరించి వండి వార్చడం, మాంసాన్ని సరిపోలే ఉత్పత్తులను కొనుగోలు చేయడం పెరిగింది’ అంటున్నారు మార్కెట్ విశ్లేషకుడు రాక్‌విల్లె.
దీక్షగా లేబుల్ పరిజ్ఞానం...
మార్కెట్ విశ్లేషకుల వద్దకు వచ్చిన విషయాలు....
పెట్ ఫుడ్ లేబుల్ ప్రధానంగా ‘నేచురల్’ అనేది ఉంటే చాలు వాటి అమ్మకాల వృద్ధి కూడా బాగుంటుంది. పెట్ కోసం ఎకో ఉత్పత్తుల కొనుగోలుకు ప్యాకేజ్డ్ ఫుడ్ పై నిజానిజాల సర్వేని పట్టణ వినియోగదారుడు మరింత ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడు. పెట్ ఆహార ఉత్పత్తుల విషయంలోనే కాకుండా పెట్స్ ఇతర ఉత్పత్తులూ కూడా పర్యావరణహితంగా ఉండే ఉత్పత్తుల కొనుగోలులో ఆసక్తి చూపుతున్నాడు.
పెట్ న్యూట్రిషన్ పట్ల వినియోగదారుడికి నూటికి నూరు శాతం ఆసక్తి పెరిగింది. ప్యాకేజ్డ్ ఫుడ్ మీద నిబంధనలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. పెట్ ఫుడ్ కొనుగోలు చేసే వినియోగదారులలో చాలా మంది విద్యావంతులైనవారే ఉండటానికి కూడా ఇది కారణం అవుతుంది. వీరే దాన్ని ప్రశ్నిస్తున్నారు. పెట్ ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఏదైనా సమస్యాత్మకమైన పదార్థాన్ని అదనంగా ఏది చేర్చినా దానిని వినియోగదారుడు తిరస్కరిస్తున్నాడు. దీంతో నేచురల్, ఆర్గానిక్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి విస్తృతంగా వచ్చేసినా వాటిలో తమ పెట్స్‌కి ఏది మంచిదో దానిని మాత్రమే వినియోగదారుడు ఎంచుకుంటున్నాడు.దీనిని దృష్టిలో పెట్టుకొని పెట్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఇచ్చే ప్రకటనలు వినియోగదారులకు మరింత చేరువ కావాలని, స్టోర్స్‌లో ఉండే ఉద్యోగులకూ పెట్ ఫుడ్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
– ఎన్.ఆర్