హెచ్డీఎఫ్సీ భారీ ఉద్యోగాల కోత | HDFC Bank lets go of 4,500 employees in Q3, may go slow on hiring | Sakshi
Sakshi News home page

హెచ్డీఎఫ్సీ భారీ ఉద్యోగాల కోత

Published Thu, Jan 26 2017 1:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

హెచ్డీఎఫ్సీ భారీ ఉద్యోగాల కోత

హెచ్డీఎఫ్సీ భారీ ఉద్యోగాల కోత

ముంబై: ఆటోమేషన్ ప్రభావంతో ప్రముఖ  ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అక్టోబర్-డిసెంబర్  త్రైమాసికంలో దాదాపు 4,500 ఉద్యోగులను  వదలుకుంది.   ఈ ధోరణి రాబోయే   క్వార్టర్స్ లో కూడా కొనసాగనుందని మార్కెట్ నిపుణులు  అంచనా  వేస్తున్నారు.

ముఖ్యంగా ఈ క్వార్టర్ లో  ఆదాయ వృద్ధి 18 సం.రాల కనిష్టానికి పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  అధిక వ్యయాలు  కూడా బ్యాంకును దెబ్బతీసినట్టు విశ్లుకులు భావిస్తున్నారు. బ్యాంకు ఆర్థిక రికవరీ పుంజుకోకపోతే ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉందంటున్నారు.  వేగవంతమైన ఆటోమేషన్ సహా వివిధ చర్యల ద్వారా ఉత్పాదకత వృద్ధిపై  దృష్టి పెట్టడం  ద్వారా  భవిష్యత్తులో ఉద్యోగుల నియామకాలు నెమ్మదించనున్నాయనే సంకేతాలలిచ్చిందని పేర్కొన్నారు. 4500

ఆటోమేషన్,  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెడ్ డీ ఎఫ్ సీ బ్యాంకు  ప్రశ్నకు సమాధానంగా  చెప్పింది. . అధిక ఉత్పాదకత , సామర్థ్యాలను పెంచుకునే ఉద్దేశంతో  గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలిపింది
 కాగా మొత్తం  సిబ్బంది  సంఖ్య  డిసెంబర్ 2016, 5 శాతం క్షీణించి  90,421గా నిలిచింది. సెప్టెంబర్ లో వీరి సంఖ్య  95,002 .
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement