
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాసెస్ ఆటోమేషన్ రంగంలో ఉన్న ఎండ్రెస్ హోసర్ హైదరాబాద్‌లో టెక్నాలజీ ఆధారిత ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే కంపెనీకి ఇతర నగరాల్లో ఇటువంటివి రెండు కేంద్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 3,000కు పైగా క్లయింట్లకు తాము సేవలు అందిస్తున్నట్టు ఎండ్రెస్ హోసర్ ఇండియా ఎండీ కైలాష్ దేశాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలియజేశారు. 70 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ ఖాతాలో 7,000 పేటెంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.750 కోట్ల ఎగుమతులతో కలిపి రూ.1,400 కోట్ల టర్నోవర్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment