హోసూరు: కబాబ్ దుకాణంలో యజమానిపై కాగుతున్న నూనె చల్లిన వ్యక్తిని మహారాజగడ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలోని మగనూర్‌పట్టికి చెందిన పర్విన్(32) చికెన్‌కబాబ్ దుకాణం నిర్వహిస్తుంది. గురువారం రాత్రి ఆ దుకాణానికి వచ్చిన అబ్దుల్‌కుద్దూస్ (31) వచ్చి కబాబ్ తిని వెళ్తుండగా దుకాణ యాజమాని పార్విన్ డబ్బులు అడగడంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది.
ఈ గొడవలో అబ్దుల్ కుద్దూస్ కాగుతున్న నూనె మహిళపై చల్లాడు. తీవ్రంగా గాయపడిన పర్విన్‌ను స్థానికులు చికిత్స కోసం ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మహారాజగడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, అబ్దుల్‌కు కుద్దూస్‌ను అరెస్టు చేశారు.
మహిళపై వేడినూనె చల్లిన వ్యక్తి అరెస్ట్
Published Sat, Oct 1 2016 7:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement