యూపీలో అత్యాచారం, హత్య
రాంపూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారకాండకు అంతులేకుండా పోతోంది. తాజాగా రాంపూర్ జిల్లాలో ఓ పనిమనిషి యజమాని ఆకృత్యాలకు బలైపోయింది. తన ఐదేళ్ల జీతం ఇవ్వాలని కోరడమే ఆమె పాలిట శాపమైంది. కేసు వివరాలు.. 24 ఏళ్ల మహిళ హైడల్ డిపార్ట్‌మెంట్ కాలనీలోని ఓ ఇంట్లో పదేళ్లుగా పని చేస్తోంది. ఐదేళ్లుగా తన జీతాన్ని యజమానుల దగ్గరే దాచింది. ఈ మొత్తం సుమారు రూ. 1.80 లక్షలు కావడంతో జూలై 3న బాధితురాలు తన జీతం ఇవ్వాలని యజమానురాలు మహితో పాటు ఆమె సోదరుడు ఫసహత్, మరో వ్యక్తి మహ్మద్ ఉస్మాన్‌లను అడిగింది.
జీతం కోసం ఆమె ఒత్తిడి తేవడంతో జూలై 12న నిందితులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఆమె ఆహారంలో విషం కలిపి హతమార్చారు. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు. దీంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వేట ప్రారంభించారు.
ఐదేళ్ల జీతం ఇమ్మన్నందుకు..
Published Mon, Aug 25 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement