అబ్బా కారు భలే ఉందంటూ ఫోటోలు దిగుతున్నారు..సడెన్‌గా ఓనర్‌ వచ్చి... | Two Boys Wanted To Take Picture With Car After Owner Did Goes Viral | Sakshi
Sakshi News home page

అబ్బా కారు భలే ఉందంటూ ఫోటోలు దిగుతున్నారు..సడెన్‌గా ఓనర్‌ వచ్చి...

Published Tue, Dec 20 2022 9:28 PM | Last Updated on Tue, Dec 20 2022 10:07 PM

Two Boys Wanted To Take Picture With Car After Owner Did Goes Viral - Sakshi

అందరికీ కార్లు కొనుక్కునేంత స్తోమత ఉండొద్దు. ఐనా ఎక్కడైన మంచి ఖరీదైన కారు పార్కింగ్‌ వద్ద ఉంటే నేరుగా వెళ్లి ఫోటోలు తీసుకుని మురిసిపోతాం. ఔనా! చాలామంది అలానే చేస్తారు. కొంతమంది పట్టుదలగా ఎప్పటికైనా కారు కొనాలని లక్ష్యం పెట్టుకుని మరీ నెరవేర్చుకున్న వారు లేకపోలేదు. ఐతే అందరికీ అలా సాధ్యం కాకపోవచ్చు. ఏ షోరూంలోనో లేక స్నేహితులు లేదా బంధువుల వద్ద కారు ఉంటే చక్కగా వాళ్లని అడగి అందులో కాసేపు కూర్చొని సరదా తీర్చకుంటాం.

అచ్చం అలానే ఇద్దరూ అబ్బాయిలు రోడ్డు పక్కకు పార్క్‌ చేసి ఉన్న అందమైన కారు చూసి ముచ్చట పడ్డారు. వెంటనే ఆ కారు వద్దకు వచ్చి ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇంతలో సడెన్‌గా ఆ కారు ఓనర్‌ వచ్చాడు. ఐతే సహజంగా ఏ ఓనర్‌ అయినా ఎవర్రా! అది అని అరిచి వెళ్లిపోయేలా చేస్తాడు. కానీ ఇతను ఏకంగా కారు కీ ఇచ్చి ఎక్కి కూర్చొని ఫోటోలు దిగమని ప్రోత్సహించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రాంలో అన్షుబాత్రా పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు ఓనర్‌ని మీది చాలా విశాల హృదయం అని ఒకరు, మంచి వ్యక్తి అంటూ మరోకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement