
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రాజేంద్రనగర్(హైదరాబాద్): తన వద్ద పని చేస్తున్న అమ్మాయిని ప్రేమ, పెళ్లి పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. సదరు యువతి గర్భం విషయం తెలపడంతో అబార్షన్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపి తన స్నేహితుడితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భాన్ని తీయించాడు. యువతి ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అసలు విషయం బయటకొచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అలియాస్ వాసు (32) ఇదే ప్రాంతంలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌ను నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, ఒకరు సంతానం కాగా..అతని వద్ద 20 ఏళ్లున్న యువతి పని చేస్తోంది. ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయాన్ని అతడికి తెలపడంతో గర్భం తీసేయాలని సూచించాడు. అనంతరం వివాహం చేసుకుందామని నమ్మించి యువతిని ఒప్పించాడు.
స్నేహితుడితో కలిసి..
నగర శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్నేహితుడి సాయంతో అబార్షన్ చేయించాడు. ఈ నెల 4 న అమ్మాయి ఆరోగ్యం క్షిణించి అధిక రక్తశ్రావం కావడంతో కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు స్థానిక ఆసుపత్రికి తరలించగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్లు పరిశీలించి యువతిని నిలదీయడంతో అబార్షన్ విషయాన్ని తెలిపింది. ఈ విషయాన్ని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు మంగళ్‌హట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించారు. స్నేహితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
చదవండి: ఫోన్ చేసి మాటల్లో పెట్టి.. 5 నిమిషాల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment