యజమాని కోసం ప్రాణాలిచ్చిన శునకం | dog saves owner's life in tamilnadu | Sakshi
Sakshi News home page

యజమాని కోసం ప్రాణాలిచ్చిన శునకం

Published Sun, May 3 2015 1:24 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

యజమాని కోసం ప్రాణాలిచ్చిన శునకం - Sakshi

యజమాని కోసం ప్రాణాలిచ్చిన శునకం

హొసూరు : యజమానిని తుపాకీతో కాల్చి హతమార్చేందుకు ప్రయత్నించిన వ్యక్తి చర్యలను అడ్డుకున్న శునకం... చివరకు తుపాకీ తూటాకు బలైంది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా కురువినాయకనపల్లి సమీపంలోని కచ్చాలికానూరు గ్రామానికి చెందిన చంద్రన్, గోవిందరాజు అన్నాదమ్ములు. వీరిలో గోవిందరాజుకు పెళ్లి కావడంతో వేరు కాపురం ఉంటున్నాడు. తండ్రి చిన్నతంబితో కలిసి చంద్రన్ ఉంటున్నాడు.
 
 ఇటీవల చిన్నతంబి మరణిస్తూ తన పేరు మీద ఉన్న ఉన్న ఇంటిని చంద్రన్‌కు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంటిలో తనకూ వాటా కావాలంటూ చంద్రన్‌తో తరచూ గోవిందరాజు ఘర్షణ పడేవాడు. శనివారం ఉదయం ఇదే విషయమై చంద్రన్‌తో తీవ్రస్థాయిలో ఘర్షణ పడిన గోవిందరాజు ఆగ్రహంతో రెచ్చిపోయి నాటుతుపాకీతో చంద్రన్‌ను కాల్చివేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో చంద్రన్ పెంచుకుంటున్న శునకం గోవిందరాజును అడ్డుకుంది. దీంతో శునకాన్ని తుపాకీతో కాల్చి హతమార్చి గోవిందరాజు పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement