M.A Yusuf Ali Car Collection: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' (Lulu Group International) అధినేత 'ఎమ్ఏ యూసఫ్ అలీ' (M.A Yusuf Ali) గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఈయన ఇండియాలోని సంపన్నుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే అనేక అన్యదేశ్యపు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో కూడా ఒకరు. యూసఫ్ అలీ గ్యారేజిలోని లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రోల్స్ రాయిస్ ఘోస్ట్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కేవలం సంపన్న వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ జాబితాలో యూసఫ్ అలీ ఉన్నారు. ఈయన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఘోస్ట్ కారుని కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఈయన గ్యారేజిలో ఉంది. యూసఫ్ అలీ కొనుగోలు చేసిన ఈ కారు వైట్ కలర్ పెయింట్ స్కీమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇతని వద్ద బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీటిని తన కుటుంబంతో పాటు ప్రయాణించడానికి ఉపయోగిస్తాడని తెలుస్తోంది. ఈ కార్లు కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండటం గమనార్హం.
బెంట్లీ బెంటాయగా
బెంట్లీ కంపెనీకి చెందిన బెంటాయగా వంటి విలాసవంతమైన SUV కూడా యూసఫ్ అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఇది కూడా కేరళ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. భారతదేశంలో మొట్ట మొదటి బెంట్లీ బెంటాయగా కొనుగోలు చేసిన వ్యక్తి యూసఫ్ అలీ కావడం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం.
(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!)
రోల్స్ రాయిస్ కల్లినన్
ముఖేష్ అంబానీ వంటి కుబేరుల వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా యూసఫ్ అలీ గ్యారేజిలో ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే రోల్స్ రాయిస్ కార్లలో కల్లినన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఈ కారుని అతడు దుబాయ్‌లో ఉపయోగిస్తాడని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!)
రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లతో పాటు యూసఫ్ అలీ మినీ కూపర్ కంపెనీకి చెందిన మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్-మేబ్యాక్ GLS, లెక్సస్ LX750, BMW 7-సిరీస్, మెర్సిడెస్-మేబ్యాక్ S600 వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజిలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే ధనవంతుల జాబితాలో యూసఫ్ అలీ ఖాన్ కూడా ఒకరుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment