కుక్క.. పనులన్నీ ఎంచక్కా.. | dogs to fan following both | Sakshi
Sakshi News home page

కుక్క.. పనులన్నీ ఎంచక్కా..

Published Thu, Feb 25 2016 4:28 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కుక్క.. పనులన్నీ ఎంచక్కా.. - Sakshi

కుక్క.. పనులన్నీ ఎంచక్కా..

పెంపుడు జంతువులను ఎవరైనా పెంచుకుంటారు. కానీ చాలా తక్కువ మందే వాటిని డిఫరెంట్‌గా పెంచుతారు. ఈ కోవలోకే వస్తాడు ఈ శునకాల యజమాని. అవును వాటిని అలా ఇలా పెంచలేదు ఎంతో ప్రత్యేకంగా పెంచాడు మరి. పూడిల్స్ మాక్స్, రూబీ అనే ఈ కుక్కలు వాటికి అవే సాటి! వాటి పనులు అవే చేసుకునేలా మాక్స్, రూబీలు శిక్షణ పొందాయి. ఓ ట్రైనర్‌ను ఏర్పాటు చేసి మరీ శిక్షణ ఇప్పించాడు వీటి యజమాని. పొద్దున లేచినప్పటి నుంచి వాటికి కావాల్సిన అన్ని పనులను ఎంచక్కా అవే చేసేసుకుంటాయి. వాటికి ఎంతో ఇష్టమైన కేకులను తయారు చేసుకుంటాయి.

వాటి గదిని శుభ్రం చేసుకుంటాయి. అంతేకాదు ఇంట్లో ఫుడ్ నచ్చకపోతే బయటకు వెళ్లి రెస్టారెంట్లలో భోంచేసి వస్తాయి. బోర్ కొట్టినపుడు బైక్‌పై చక్కర్లు కొడతాయి.. ఊయల ఊగుతాయి.. పియానో వాయిస్తాయి.. ఒక్కటేమిటి అవి చేసే పనులకు వాటి యజమాని ఉబ్బితబ్బిబ్బయిపోతుంటాడు. వాటి పేరు మీద ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచి ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. వీటికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తక్కువేంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement