Pets Animals
-
పెట్ పేరెంట్స్ Vs నాన్ పెట్ పేరెంట్స్..
-
భార్యను చంపేశా! అంటూ స్నేహితుడికి వాయిస్ మెయిల్..షాక్‌లో పోలీసులు
ఏమైందో ఏమో ఒక మహిళా జడ్జి, ఆమె భర్త, వారి పెంపుడు జంతువులతో సహా ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన న్యూమెక్సికోలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బెర్నాలిల్లో కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు(పోలీసులు) అల్బుకెర్కీలోని రాంచిటోస్ రోడ్లో ఉన్న ఆ జడ్జీ ఇంటి వద్దకు వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్లు తాము పనికి వచ్చేటప్పటికే ఆ భార్యభర్తలిద్దరు, వారి పెంపుడు జంతువులు చనిపోయి ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళ లాస్ రాంచోస్ మున్సిపల్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న 65 ఏళ్ల డయాన్ ఆల్బర్ట్‌గా గుర్తించారు. ఐతే పోలీసులు జడ్జీ భర్త ఎరిక్ పింక్‌టరన్ తన భార్య ఆల్బర్ట్తోపాటు వారి పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత పింక్‌టరన్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే బాధితుడు పింక్‌టరన్ తన స్నేహితుడుకి తన భార్యను పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపినట్లు వాయిస్ మెసేజ్ పంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు మెయిల్లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి అతను కౌంటీ షరీఫ్ కార్యాలయానికి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు కేసు నమోదు చేసుకుని పలుకోణాల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య.. శవాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో..) -
ఆకాశ ఎయిర్ ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝన్ వాలాకు చెందిన దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ పెట్ లవర్స్‌కు శుభవార్త అందించింది. త్వరలోనే తమ విమానాల్లో పెట్స్ తో సహా ప్రయాణించే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది. ఆకాశ ఎయిర్‌లైన్స్ తాజా ప్రకటన ప్రకారం ఈ ఏడాది నవంబరు 1 నుంచి తన విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించనుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు అక్టోబరు 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక వ్యక్తికి 7 కిలోల వరకు బరువు ఉన్న ఒక పెంపుడు జంతువును అనుమతిస్తామని విమానయాన సంస్థ తెలిపింది. "పెంపుడు జంతువుల పాలసీకి సంబంధించి ఇది తొలి అడుగు అని, ప్రస్తుతం పెంపుడు పిల్లులు , కుక్కలను అనుమతిస్తాం త్వరలోనే మరింత విస్తరిస్తామని’’ సంస్థ ప్రకటించింది. ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 6 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని, ప్రతి 15 రోజులకు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను జోడిస్తున్నామని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , సీఈఓ వినయ్ దూబే తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 18 విమానాలు, రానున్న అయిదేళ్లలో 72 విమానాల అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. దీంతో పెట్ లవర్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. Oh yayyy! https://t.co/8mrwX3Hyso — Chinmayi Sripaada (@Chinmayi) October 6, 2022 -
వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్ ధనిక జంతువులు ఇవేనండి!
డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. జంతువులేంటి.. వాటికి సంపదేంటి అనుకుంటున్నారా! అవేమీ కంపెనీలు పెట్టి ధనం కూడబెట్టలేదండీ! వాటి యజమానులు ప్రేమతో ఇచ్చిన సంపదతో ఈ పెంపుడు జంతువులకు డబ్బు చేసింది. అయితే వీటిలో కొన్ని స్వయంకృషి జంతువులు కూడా ఉన్నాయి. అంటే సినిమాల్లో, టీవీల్లో నటించడం ద్వారా ఇవి బోలెడు సంపద ఆర్జించాయన్నమాట! ఇలా ఈ జాబితాలో చేరిన జంతువుల ఆస్తుల వివరాల్లో కొన్ని అతిశయోక్తులున్నాయని తర్వాత తెలిసింది. ప్రస్తుతం ► జిగో అనే కోడి పెట్టను టెక్ట్స్ బుక్ రచయిత మైల్స్ బ్లాక్వెల్ పెంచుకున్నారు. తన తదనంతరం సదరు పెట్టగారికి బ్లాక్వెల్ 1.5 కోట్ల డాలర్లు రాసిచ్చారు. ► ఇటలీకి చెందిన రియల్టీ వ్యాపారి మారియా అసుంటా బజార్లో ఒక పిల్లిని చూసి జాలిపడి తెచ్చుకొని టొమసో అని పేరు పెట్టి పెంచుకున్నారు. 94ఏళ్ల వయసులో ఆమె మరణించారు. ఆమె విల్లు ప్రకారం టొమసోకు 1.3 కోట్ల డాలర్ల ఆస్తి దక్కింది. ► 2018 వరకు బ్లాకీ అనే పిల్లి 1.25 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్న పిల్లిగా పేరుగాంచింది. ► గైల్ పోస్నర్ అనే ఆమె తన పెంపుడు కుక్క కొంచిటాకు 30 లక్షల డాలర్ల ధనంతో పాటు దా దాపు 80 లక్షల విలువైన భవంతిని ఇచ్చేసింది. ► లియోనా హెల్మ్స్లే అనే ఆమె తన మనవళ్లపై కోపంతో తనకున్న 1.2 కోట్ల డాలర్లను ట్రబుల్ అనే కుక్కకు రాసింది. అయితే తర్వాత కోర్టులో జడ్జిగారు కుక్కకు 20 లక్షలు చాలని తీర్పిచ్చారు. ► అగ్ని ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తమను రక్షించిందన్న కృతజ్ఞతతో ఫ్లాసీ అనే పెంపుడు కుక్కకు డ్రీ బారీమోర్ దంపతులు 13లక్షల డాలర్ల ఇంటిని ముద్దుగా ఇచ్చేసింది. ► టింకర్ అనే పిల్లికి దాని యజమాని ద్వారా దాదాపు 8లక్షల డాలర్ల ఇల్లు, 2.26 లక్షల డాలర్ల సంపద ముట్టాయి. ► ఫాషన్ మేనేజర్ కార్ల్ పెంచుకునే చుపెట్టే అనే పిల్లికి 20 కోట్ల డాలర్ల ఆస్తి దక్కినట్లు వార్తలు వచ్చాయి, కానీ నిర్ధారణ జరగలేదు. ► ఇక పిల్లుల్లో మహారాజా పిల్లి అంటే గ్రుంపీ క్యాట్నే చెప్పుకోవాలి. అనేక షోలు, సినిమాల్లో నటించి ఈ పిల్లి దాదాపు 10 కోట్ల డాలర్లు సంపాదించింది. ► ఒలివియా బెన్సన్ అనే పిల్లి సుమారు 9.7 కోట్ల డాలర్లను వివిధ కార్యక్రమాల ద్వారా సంపాదించింది. ► గుంతర్6 అనే కుక్కకు కోట్ల డాలర్ల ఆస్తి దక్కిందని అనేక వార్తలు వచ్చినా అదంతా ప్రాంక్ అని తర్వాత తెలిసింది. డబ్బున్నవారు ఏక్షణం ఏం చేస్తారో తెలియదు కాబట్టి, ఈ జాబితా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. చట్టబద్దత ఉందా? జంతువులు న్యాయ పరిభాషలో లీగల్ పర్సన్స్ కావు కనుక వీటి పేరుమీద సొంత ఆస్తులు, ధనం ఉండదు. పెంపుడు జంతువంటేనే ఒక ఆస్తి, అందువల్ల మరో ఆస్తిని ఈ ఆస్తికి కట్టబెట్టేందుకు చట్టాలు అంగీకరించవు. అందుకే ఆయా జంతువుల యజమానులు ఏర్పాటు చేసిన ట్రస్టులు ఈ జంతువుల ఆస్తుల నిర్వహణ చేస్తుంటాయి. ఈ సొమ్మును కేవలం సదరు జీవి బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సిఉంటుంది. సదరు జంతువు మరణిస్తే ట్రస్టు నిబంధనల ప్రకారం మిగిలిన సొత్తును వినియోగిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే
జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కొందరు శునకాల్ని, మరి కొందరు మార్జాలాలను, ఇంకొందరు పక్షులను.. ఇలా రకరకాల ప్రాణులను తమ ఇండ్లలో పెంచుకుంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. వాటి కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధ పడతారు. ప్రపంచంలోనే ఖరీదైన కొన్ని పెంపుడు జంతువులను ఇక్కడ చూద్దాం.. – ఏపీ సెంట్రల్ డెస్క్ గ్రీన్ మంకీ – థ్రోగ్బ్రెడ్ రేస్ హార్స్.. రూ.117 కోట్లు అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుగా అమెరికాకు చెందిన మగ రేసు గుర్రం గ్రీన్ మంకీ నిలుస్తుంది. తొలి రేసులోనే అత్యంత వేగంగా పరుగుపెట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక మైలు దూరాన్ని కేవలం 10 సెకండ్లలోనే అధిగమించింది. కాబట్టి దీనికి అంత రేటు. దీని వీర్యం కూడా ఖరీదైనది కావడంతో ఈక్వెస్ట్రియన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. అందువల్ల దీనిని పోటీ పడి కొన్నారు. సర్ లాన్స్‌లాట్ ఎన్కోర్ – లాబ్రడార్..117 కోట్లు లాబ్రడార్ శునకానికి అంత ఖరీదు ఎందుకు అనిపించవచ్చు. అయితే ఇదొక అద్భుతమైన కుక్క. అందుకే దీనికి అంత రేటు. ఏంటా అద్భుతం అంటే.. ఇది పూర్తిగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోనే విజయవంతంగా జన్మించిన శునకం. అందువల్లే దీనికి అంత రేటు అన్నమాట. మిస్ మిసీ – ఆవు రూ. 8.82 కోట్లు ఆవు ఇంత ఖరీదా... అని మనం నోరెళ్లబెట్టవచ్చు. అయినా.. ఈ హోలిస్టీన్ ఆవు ప్రత్యేకతలు అలాంటివి మరి. ఆవుల పోటీల్లో పలు అవార్డులు పొందడంతో దీనికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అంతేగాక సాధారణ ఆవుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా పాలిస్తుంది. రెడ్ ప్యూర్ బ్రీడ్ టిబెటిన్ మాస్టిఫ్... 4.28 కోట్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతి శునకం ఇది. ఈ జాతి అత్యంత అరుదైనది కావడంతోనే దీనికి ఆ రేటు. ముందు నుంచి చూస్తే అచ్చం సింహం ఆకారంలో ఉంటుంది. మనుషులతో స్నేహ పూర్వకంగా మెలుగుతాయి. ఇప్పుడు వీటిని ఇతర శునకాలతో క్రాస్ బ్రీడ్ చేస్తున్నారు. ఒరిజినల్ బ్రీడ్ మాత్రం అత్యంత ఖరీదైనదే. తెల్ల సింహం కూన రూ. 1.03 కోట్లు ఈ తెల్ల సింహం పిల్లలను చూస్తే భలే ముద్దొస్తున్నాయి కదా! వీటిని పెంచుకుందామని అనుకుంటే మాత్రం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క కూనను విడిగా అమ్మరు కాబట్టి.. రెండు కూనలను కొన్నాల్సి వస్తుంది. అంటే రూ. 2.06 కోట్లు పెట్టాల్సిందే. సింహాల్లో అత్యంత అరుదైన రంగు కాబట్టి వీటికి ఆ రేటు. కొన్ని దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అరేబియన్ గుర్రం రూ. 70 లక్షలు గుర్రాల్లో అరేబియన్ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. చింపాంజీ రూ. 44.14 లక్షలు మనుషుల తర్వాత తెలివైన జీవులుగా చింపాంజీలకు పేరుంది. ఈ తెలివైన జీవులు మనుషులకు బాగా మచ్చిక అవుతాయి. యజమానులతో ఆటలు ఆడతాయి. నవ్విస్తాయి. కవ్విస్తాయి. వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి బొనోబో, రెండోది సాధారణ చింపాజీ. చాలా దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే వీటి రోజు వారీ ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లావెండర్ అల్బినో బాల్ పైథాన్ రూ. 30 లక్షలు పామును పెంచుకోవడం అంటే అయ్యబాబాయ్ అంటాం. అలాంటిది ఓ కొండచిలువ (పైథాన్)ను పెంచుకోవడమా.. అని అనిపిస్తుంది. కొంతమందికి పాముల్ని పెంచడం కూడా ఓ హాబీ. లావెండర్ అల్బినో బాల్ పైథాన్ ఆఫ్రికా ఖండానికి చెందిన చిన్న సైజు కొండచిలువ. ఈ కొండచిలువ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే పెంచుకుంటారు. సవానా పిల్లి రూ. 15 లక్షలు సాధారణ పెంపుడు పిల్లికి, ఆఫ్రికా సెర్వల్ జాతి పిల్లికి పుట్టినది ఈ పిల్లి. సాధారణ పెంపుడు పిల్లి కన్నా కొంచెం ఎత్తుగా, నాజూగ్గా ఉంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతాయి. సరదాగా ఉంటాయి. ఇతర పిల్లుల్లా కాకుండా నీటిలో ఆడుకోవడం అంటే వీటికి భలే సరదా. ఎవరూ తోడు లేకపోయినా స్వతంత్రంగా ఆడుకోవడం ఈ పెంపుడు పిల్లులకు అలవాటు. గుర్రాల్లో అరేబియన్ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. హ్యాసింత్ మకావ్ రూ. 10 లక్షలు రామచిలుక జాతుల్లో ఇదో పెద్ద జాతి. నీలం రంగుతో భలే చూడ ముచ్చటగా ఉంటుంది. దీనిని కొనడమే కాదు.. పెంచడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఈ తెలివైన పక్షులకు మంచి నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుంది. దీనికి సౌకర్యవంతమైన గూడు ఏర్పాటు చేయాలి. ఖర్చును తట్టుకుంటే ఇదో మంచి పెంపుడు పక్షిలా ఉంటుంది. సులువుగా దీనికి తర్ఫీదు ఇవ్వవచ్చు. యజమానులతో చాలా ప్రేమగా ఉంటుంది. -
జంతువులతో జాగ్రత్త.. విస్తుగొలిపే విషయాలు
ప్రాచీన కాలం నుంచి జంతువులతో మానవుని సహచర్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి మనిషి పశు పక్షాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాడు. అంతే కాదు.. పెంపుడు కుక్కను మించిన విశ్వాసపాత్రమైన జంతువు మరొకటి ఉండదని పలువురు చెబుతుంటారు. ఈ సహచర్యంలో కొన్ని వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు తెలియకనే సంక్రమిస్తున్నాయి. ఆధునిక వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కొన్ని వ్యాధులకు ఇప్పటికీ వైద్యం లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంక్రమిస్తున్న స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, రేబిస్, హెచ్ఐవీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19) కూడా జంతువుల నుంచే మానవులకు సంక్రమించింది. మనుషులకు వచ్చే ప్రతి మూడు జబ్బుల్లో రెండు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల(జూనోటిక్ వ్యాధులు)పై ప్రత్యేక కథనం. సాక్షి, ఖమ్మం : జంతువుల నుంచి మనుషులకు, వారి నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకుతాయని నిపుణులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ప్లూ వంటి వ్యాధులతో పాటు రేబిస్, టీబీ, జపనీస్ ఎన్‌సఫలైజేషన్ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమా దం ఉంది. కుక్కకాటు ద్వారా రేబిస్, పందుల ద్వారా జపనీస్ ఎన్‌సఫలైజేషన్ (మొదడువాపు), పశువులు, గొర్రెలు వంటి ద్వారా టీబీ సోకుతున్నాయి. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధు లను జూనోటిక్ వ్యాధులు అంటారు. రేబిస్‌కు సంబంధించి వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలు మినహా, వ్యాధి సోకిన తర్వాత వైద్యం లేదు. మూడేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రపదేశలో జబ్బు చేసిన మేకను తినడం వల్ల ఆంత్రాక్స్ ప్రబలిన విషయం తెలిసిందే. బర్డ్‌ఫ్లూ సైతం దేశంలో పలు ప్రాంతాల వ్యక్తులను వణికించిన విషయం కూడా తెలిసిందే. అడవి గబ్బిలం ద్వారా సోకే నిఫా వైరస్ కేరళలో 10 జూన్ 2018లో బయటపడి ఆ రాష్ట్రాన్ని వణికించింది. బర్డ్‌ప్లూ వ్యాధి: బర్డ్‌ప్లూ లేదా ఇన్ప్లూయెంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉప రకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంక్రమిస్తు్తంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్ల కొలది కోళ్లు మరణించాయి. ప్రధానంగా వీటి పెంకందారులు, షెడ్లలో పనిచేసే వారికి త్వరితగతిన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్లకలకతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన టీకా మందును ఇంతవరకు కనుగొన లేదు. టామిప్లూ వంటి వైరస్ నిరోధక మందులు వ్యాధి తీవ్రతను, వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు కొంత మేరకు ఉపయోగపడుతాయి. ఆంత్రాక్స్ వ్యాధి: ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్: ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బ్రూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వంధ్యత్వం ఏర్పడుతుంది. ఇవిగాక మైకో బ్యాక్టీరియా బ్యుటర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల క్షయ లేదా టీబీ, లెప్టాస్పైరా ఇక్టిరోహియో రేజికా బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పైరోసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. కుక్కకాటుకు గురైతే ఏం చేయాలి.. కుక్కకాటుకు గురైనప్పుడు తక్షణమే ఆ గాయాన్ని సబ్బు నీటితో కానీ, మంచి నీటితో కానీ నిరంతరాయంగా పది నిమిషాల పాటు కడగాలి. కుక్క కరిచిన గాయానికి కట్టు కట్టడం, కుట్లు వేయడం, అయింట్మెంట్లు రాయడం కానీ చేయకూడదు. వీలైనంత త్వరగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. గాయాలు పెద్దవిగా ఉన్నా, తలకు దగ్గరకు కరిచినా ఏఆర్వీతో పాటు ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఇంజెక్షన్లు తీసుకుంటే రేబిస్ సోకకుండా 95 శాతం రక్షణ ఉంటుంది. ప్రస్తుతం దీనిని ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా వేస్తున్నారు. కుక్క కరవడమే కాకుండా కాళ్లతో గీరినప్పుడు రక్తం వచ్చినా, శరీరంపై ఉన్న గాయాలపై కుక్క నాలుకతో నాకినా రేబిస్ వ్యాధి వచ్చే ఆవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వెంటనే ఏఆర్వీ వేయించుకోవాలి. రేబిస్ సోకిన వ్యక్తి ద్వారా కూడా ఇతరులకు వ్యాధి సోకే ఆవకాశం ఉంది. రేబిస్ వ్యాధి.. రేబిస్ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ అన్ని కుక్కల వల్ల రేబిస్ వస్తుందనేది అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేబిస్ వ్యాధి రాబ్డో అనే వైరస్ వల్ల సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్ గాలి, నీటి ద్వారా మార్పు చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వల్ల వాటిలో ఉన్న వైరస్ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఉన్న కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. రేబిస్ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన రేబిస్ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి, విచిత్రంగా ప్రవర్తిస్తాయి. వ్యాధిని గుర్తించకపోవడంతో కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. జూనోటిక్ వ్యాధి కారకాలు 7 రకాలు ∙ బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ∙ వైరస్: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్ ∙ ప్రొటోజువా: టాక్సోప్లాస్మోడియా, లైష్మెనియాసిస్ ∙ రెకెట్షియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ∙ హెల్మెంథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ∙ ఎక్టోపారాసైట్స్: స్కేజిస్ పశువుల్లో రేబిస్ లక్షణాలు రేబిస్ వ్యాధి సోకడం వల్ల పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం లాంటివి కనిపిస్తాయి. శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం. అరుపులు ఆవలింతలా వస్తాయి. నీటిని తీసుకోవు. పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11 రోజుల్లో జరిగిపోతాయి. మనుషుల్లో.. జ్వరం రావడం, కాళ్లు పట్టుకుపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణిస్తారు. నివారణ చర్యలు.. ఈ వైరస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి. కుక్కలతో తీసుకోల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వల్ల కలిగే వ్యాధుల గురించి వివరించాలి. రేబిస్ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. జూనోసిస్ డే.. లూయిస్‌పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి నిరోధక టీకా ఇవ్వడం ద్వారా రేబిస్ వ్యాధి రాకుండా కాపాడగలిగాడు. దీంతో అప్పటి నుంచి ఏటా జూలై 6న జూనోసిస్ దినోత్సవంగా జరుపుతున్నాం. ఈ సందర్భంగా వ్యాధులు, సంక్రమణ విధానం, వాటి పట్ల అవగాహన కలిగించడంతో పాటు, నివారణపై ప్రజలకు అవగాహన కలిగించాలి. -
పక్షుల్లో తెల్లని విరేచనాలు..
హిమాయత్‌నగర్: ఇళ్లలో పెట్స్‌ను పెంచుకునేవారు వాటిని ఇంటి కుటుంబసభ్యుల్లా ట్రీట్ చేస్తుంటారు.. వాటిని అత్యంత ప్రేమగా చూసుకుంటారు.. చిన్న సమస్య వచ్చినా అల్లాడిపోతుంటారు.. సీజన్ మారుతున్నకొద్దీ వాటిపై మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. ఓ పక్క ఎండలు మండుతున్నాయి.. వేడిగాలులు మొదలయ్యాయి.. దీంతో పెట్స్ విలవిల్లాడుతున్నాయి. ఎప్పుడూ పెట్టే ఆహారాన్ని అయిష్టంగా తింటున్నాయి. దీంతో యజమానులు డాక్టర్లను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నా.. లాక్డౌన్ కారణంగా వాటిని బయటకు తీసుకువెళ్లాలంటే బయపడుతున్నారు. ఇళ్లలోనే వాటికి ఆహారంలో మార్పులు చేస్తున్నా.. చాలామందికి అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం 24 గంటలూ ఇళ్లలో పెట్స్‌తో కలిసి ఉంటున్నారు. పెట్స్‌ను అల్లారుముద్దుగా పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అవి హుషారుగా ఉంటాయని అంటున్నారు నారాయణగూడలోని ‘సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్’ వైద్యురాలు డాక్టర్ బి.స్వాతిరెడ్డి..ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. తరచూ ఇవే సమస్యలు సమ్మర్లో ఎండవేడిని పెట్స్ తట్టుకోలేవు. వాటికి కొద్దిపాటి ఎండ తగిలితే నీరసానికి గురవుతాయి. ‘సమ్మర్ టిక్స్’ (ఎక్టో ప్యారసైటిక్), పెట్‌కి దోమర్లు మాదిరిగా వస్తుంటాయి. చెమట వస్తున్న కారణంగా దురదలు వ్యాపించి ఇవి వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి మంచి షాంపుతో స్నానం చేయించాలి. ప్రతిరోజూ గ్రూమింగ్(దువ్వాలి), ఇంట్లో వెంటిలేషన్(వెలుతురు) చక్కగా వచ్చేలా చూసుకోవాలి. అదేవిధంగా ‘ఎపిస్టాక్సిస్’కు గురవుతాయి. అంటే ఎండ, వేడి గాలికి గురైన పెట్స్ ముక్కు నుంచి రక్తం వస్తుంటుంది. ఇలా వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో ఐస్ప్యాక్లను ముక్కు, తల, పొట్టపై అదుముతూ ఉండాలి. ఇలా చేస్తుండటం వల్ల ముక్కు నుంచి వచ్చే బ్లీడింగ్ ఆగిపోయి, మామూలుగా ఉంటుంది. ఆ తర్వాత వైద్యుల సలహా తీసుకోవచ్చు. అదేవిధంగా వేడి తాపానికి పెట్స్ నోరు తెరిచి, నాలుక బయటపెట్టి అతి కష్టం మీద శ్వాస తీసుకుంటాయి. అలా శ్వాస తీసుకునే క్రమంలో నోట్లో నుంచి ఎక్కువగా సొల్లు కారుతుంటుంది. ఇలా చేస్తున్న పెట్స్‌కి కూడా తక్షణం మనవద్ద ఐస్ప్యాక్స్ని పెట్టి వైద్యుల సూచనలు తీసుకోవాలి. పక్షుల్లో తెల్లని విరేచనాలు పక్షులు ఎండవేడికి అస్సలు తట్టుకోలేవు. సమ్మర్లో పక్షులు సాయంత్రానికి సచ్చిపోతుంటాయి. అంటే ఉదయం నుంచి అవి సన్‌స్ట్రోక్‌కు గురయ్యాయని అని మనం నిర్ధారణకు రావాల్సిందే.. ఎండకు గురైన పక్షులు ‘రానికెపో డిసీస్’కి గురైనట్లు అంటే తెల్లని వీరేచనలు చేస్తుంటాయి. డల్‌గా ఉండటం, ఏమీ తినకపోవడం చేస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతకంటే ముందు వాటిని సాయంత్రం వాతావరణం చల్లబడే వరకు బయటకు రానివ్వకుండా ఉంటే వాటికే మంచిది. లాక్డౌన్ కారణంగా పెట్స్‌ని వాకింగ్‌కి, లెట్రిన్‌కి బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి. వాటికి బొమ్మలు ఎక్కువగా ఇచ్చి వాటిని ఆడించే ప్రయత్నం చేయాలి. తద్వారా జీర్ణం త్వరగా అయ్యి ఆరోగ్యకరంగా ఉంటాయి. కొందరు పెడిగ్రీ లాంటివి మాత్రమే పెడుతుంటారు. ఇలా కాకుండా అన్నం వండే సమయంలోనే వాటితో పాటు కర్డ్ రైస్, కూరగాయలను కూడా ఉడకబెట్టి ఆహారంగా పెట్టొచ్చు. అదేవిధంగా చికెన్, మటన్‌ని కూడా ఇలాగే పెడితే మంచిది. అలాగే కర్డ్ రైస్, ఎగ్స్, పన్నీర్ పెడితే ప్రొటీన్ ఎక్కువగా వస్తుంది. ♦ వాటర్మిలాన్, కీరా, యాపిల్ వంటి ఫ్రూట్స్ కూడా ఎక్కువగా పెట్టొచ్చు. ♦ పెట్స్ ఉండే ఫ్లోర్ అంతా నీట్‌గా, చల్లగా ఉంచాలి. తడిగా ఉన్న ప్రదేశంలో వాటిని పడుకోబెట్టొద్దు. అలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ♦ 24గంటలూ చల్లని వాటర్ అందుబాటులో ఉంచాలి. ఎంతచల్లని వాటర్ తాగిస్తే అంత మంచిది. వాటర్‌తో పాటు గ్లూకోజ్ పౌడర్ వేస్తే మరింత శక్తిగా ఉంటాయి. ♦ కుక్కకు ఎక్కువగా కాళ్ల మధ్య చెమటలు వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఏసీ లేదా కూలర్ ఉంటే బెటర్, లేదంటే ఫ్యాన్ గాలైనా ఎక్కువగా తగులుతుండాలి. నా పెట్ అంటే నాకు ఎంతో ఇష్టం నాకు పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం. మేం పెంచుకునే పెట్స్ మా ఇంట్లో చాలా స్పెషల్. అందుకోసం వైద్యులు చెప్పిన విధంగా అన్ని ప్రికాషన్స్ వాడుతుంటాం. సమ్మర్లో ఏసీలోనే ఉంచుతూ ప్రొటీన్ ఫుడ్ పెడుతున్నాను. ఎక్సర్సైజులు కూడా చేయిస్తూ.. అల్లారుముద్దుగా చూసుకుంటున్నా.– హర్షితజోషి, బిజినెస్ ఉమెన్, మలక్‌పేట్ అస్సలు బయటకు రానివ్వను నేను బయటకు వెళ్తుంటే వెనకే వస్తుంది. నా పెట్ని బయటకు రానివ్వను. దానికి కావాల్సిన వాటిని తెచ్చి పెడుతుంటాను. దగ్గర ఉండీ ఫ్యామిలీ అంతా చూసుకుంటున్నాం. సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇంట్లో పెట్ మాత్రమే కాదు. స్ట్రీట్డాగ్స్ విషయంలో కేర్ తీసుకుంటాను.– అలేఖ్యచిన్ని, వనస్థలిపురం -
జంతువులకూ కరోనా పరీక్షలు
సాక్షి, అమరావతి: దేశంలో పెంపుడు జంతువులు, వన్యప్రాణులకు సైతం కరోనా వైరస్ (కోవిడ్– 19) ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల వీటికి కూడా కోవిడ్ –19 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా శాంపిల్స్ పరీక్షల కోసం నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) జంతువైద్య విభాగం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జ్యోతి మిశ్రీ ఆయా సంస్థలకు, రాష్ట్రాల పశువైద్యశాఖలకు ఆదేశాలు జారీచేశారు. శాంపిల్స్ సేకరణ, పరీక్షల సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్ ) నిబంధనావళిని పక్కా గా పాటించాలని పేర్కొన్నారు. ఎంపికచేసిన సంస్థలివే.. ► నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) – భోపాల్ (మధ్య ప్రదేశ్) ► నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఎన్ఆర్సీఈ) – హిసార్ (హరియాణా) ► సెంటర్ ఫర్ యానిమల్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ (సీఏడీఆర్‌ఏడీ) ► ఇండియన్ వెటర్నరీ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) – ఇజాత్ నగర్, బరేలి, ఉత్తర ప్రదేశ్ -
బ్లెస్సీ.. ఎక్కడున్నావ్?
బంజారాహిల్స్: ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న జంతువుల పట్ల నగరవాసుల మమకారం పెరుగుతోందనడానికి ఇదో ఉదాహరణ. తమ పెట్స్ కనిపించకపోతే తట్టుకోలేకపోతున్నారు. తిరుమలగిరి జూపిటర్ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్వరి తన పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని, దాన్ని దత్తత తీసుకున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. దాన్ని వెతికిపెట్టాలంటూ శుక్రవారంబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ‘క్యాట్ మిస్సింగ్’ కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలగిరికి చెందిన రాజేశ్వరి కొంత కాలంగా బ్లెస్సీ ముద్దు పేరుతో రెండు నెలల వయసున్న పిల్లిని ముద్దుగా పెంచుకుంటున్నారు. దీనికి తోడుగా మరో పిల్లి కూడా ఉండటంతో త్వరగా జబ్బులు సంక్రమిస్తాయన్న కారణంగా ఓ పిల్లిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని ఇటీవల పీపుల్ ఫర్ ఏనిమల్ సంస్థను సంప్రదించారు. చట్టప్రకారం దత్తత ఇవ్వవచ్చని ఆ సంస్థ చెప్పడంతో తన పిల్లిని దత్తత ఇస్తానని ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. అది చూసి బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని శ్రీనికేతన్ కాలనీలో నివసించే యువకుడు ఆ పిల్లిని తాను దత్తత తీసుకుంటానని ఆమెను సంప్రదించాడు. అలా ఈ నెల 13వ తేదీన రాజేశ్వరి తన బ్లెస్సీ(పిల్లి)ని యువకుడికి అప్పగించింది. అయితే, ఈ నెల 20వ తేదీన ఆ పిల్లికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉండడంతో గుర్తు చేసేందుకు సదరు యువకుడికి ఫోన్ చేయగా సరైన సమాధానం రాలేదు. దాంతో ఆమె ఆయన ఇంటికి వచ్చి పిల్లి ఏదని ప్రశ్నించగా ఆ రోజు కూడా అతడు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె మూడు రోజుల పాటు తిరిగినా పిల్లి కనిపించలేదు. చివరాకరకు పిల్లి కనిపించడం లేదని సదరు యువకుడు చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోయింది. తేరుకొని శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. దత్తత పిల్లిని పొగొట్టిన ఆ యువకుడిపై ‘క్రుయాలిటీ చట్టం’ కింద కేసు నమోదు చేయాల్సిందిగా ఆమె ఇన్స్పెక్టర్ను కోరారు. వైట్ అండ్ బ్లాక్ ఇండియన్ బ్రీడ్‌కు చెందిన ఈ పిల్లి అంటే తనకు ప్రాణమని బాగా చూసుకుంటానంటే ఇచ్చానని, ఆదానికి ఏ ఆహారం ఇష్టంగా తింటుందో.. ఏది పెట్టకూడదో ముందే జాగ్రత్తలు చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. తన పిల్లిని ఇతరులకు విక్రయించాడా..? కొట్టి చంపాడా..? సహజంగానే అదృశ్యమైందా అన్నదానిపై దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిల్లిని పట్టి అప్పగించిన వారికి రూ.10 వేల బహుమతి కూడా ప్రకటిస్తూ మళ్లీ ఫేస్బుక్లో పోస్టు చేసిందామె. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పిల్లి కోసం గాలింపు చేపట్టి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
స్నేహంతో స్పృశిస్తాం.. ప్రేమలతో తరిస్తాం..
ఎక్కడి నుంచి తెచ్చావ్.. ఈ కుక్కపిల్లను..! అనడిగితే చాలా మందికి కోపమొస్తుంది. ‘ఇది కుక్కపిల్ల కాదు.. మా రీనా. మా ఫ్రెండ్’ అంటూ ఘాటుగా సమాధానమిస్తారు. కుక్కపిల్లనో.. పిల్లి అనో పిలిస్తే వారు ఒప్పుకోరు. ఇది కాస్త చాదస్తంగా.. అనిపించినా నగర జీవనంలో ఇప్పుడు చాలామంది తమ పెంపుడు జంతువుల విషయంలో ఇలానే ఉంటున్నారు. ఈ పద్ధతి కుక్కపిల్లకే పరిమితం కాలేదు.. అన్ని జంతువుల విషయంలోనూ ఇలానే ఉంది. వాటికి రూ.లక్షలు ఖర్చుపెట్టి పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. చనిపోతే రిచ్‌గా సమాధులు కట్టించేవారూ ఉన్నారు. పెంపుడు జంతువులపై నగరవాసి పెంచుకున్న ప్రేమకు ఇది నిదర్శనం. నేడు జాతీయ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నగరంలో జంతుప్రేమకుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే పెద్దవారికి తోడుగా ఉంటాయనే ఆలోచన నుంచి యువత తమ తోటి స్నేహితులుగా పలు రకాల జంతువులను, పక్షులను ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా కలవర పడుతున్నారు. జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పంచుతున్నాయి. ఇటీవలి కాలంలో చాలా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలు ఇందుకు ఉదాహరణగా నిలిస్తున్నాయి. జంతు సంరక్షణలో సంస్థలు.. ఏ జంతువైనా సరే మనతో కలిసి జీవించే హక్కు ఉందంటున్నారు జంతు ప్రేమికులు. అందుకే వాటి సంరక్షణ కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి హక్కుల కోసం పోరాడుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని బ్లూక్రాస్ సంస్థ దాదాపు 24 ఏళ్లుగా జంతు సంరక్షణ సేవలందిస్తోంది. ఇక్కడి సభ్యులు ఇప్పటి వరకు దాదాపు 4 లక్షలకు పైగా జంతువులను కాపాడారు. వాటికి అవసరమైన వైద్యం అందించి ప్రాణం పోశారు. మరో 1,22,480 పక్షులను కాపాడడంతో పాటు 12,805 జంతువులను దత్తత తీసుకొన్నారు. ఈ ఉద్యమాన్ని బ్లూక్రాస్ హైదరాబాద్ నిర్వాహకురాలు అక్కినేని అమల 1992 నుంచి చేస్తున్నారు. ఈ సంస్థనే కాకుండా స్నేక్ సొసైటీలు, జంతు సంరక్షణ సంస్థలు నగరంలో చాలానే ఉన్నాయి. ఎవరన్నా జంతువులు, పక్షులను బాధపెట్టేలా ప్రవర్తించినా, గాయం చేసినా వారికి శిక్ష వేయించేలా కృషి చేస్తున్నారు. మరో ప్రపంచంలో ఉన్నట్టే.. నా వద్ద పది కుక్కలున్నాయి. ఇంట్లో ఉన్నంత సేపూ వాటితోనే గడుపుతుంటా. వాటితో ఉన్నంత సేపూ మరో ప్రపంచంలో ఉన్నట్టు ఆనందంగా ఉంటుంది. ఆ ప్రాణులుకు ఏమన్నా జరిగితే అస్సలు తట్టుకోలేను. తగ్గేవరకు మనసు మనసులో ఉండదు. – పూరీ జగన్నాథ్ ఒత్తిడిలో పెద్ద రిలీఫ్ అవే.. ఒక్క జంతు సంరక్షణ దినోత్సవం నాడేకాదు.. జంతువులను ప్రతిరోజు ప్రేమగా చూడాలి. ఆ మూగ జీవాలను అర్థం చేసుకోవాలేగాని హాని చేయకూడదు. నా వద్ద రెండు పిల్లులు ఉన్నాయి. వాటిని చూస్తే చాలు నాకు పెద్ద రిలీఫ్‌గా ఉంటుంది. – సదా గుండెల నిండా ప్రేమ.. హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే చాలా ప్రేమ. ఈ మధ్య అతను ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల ఒక్కటి మృత్యువాతపడింది. దీంతో దాదాపు వారం రోజులపాటు కోలుకోలేకపోయాడు. బేగంపేటలో మరో కుటుంబం ముద్దుగా పెరిగిన శునకం కన్నుమూస్తే ఇంటిల్లిపాది కన్నీరుమున్నీరయ్యారు. ప్రత్యేకంగా దహన సంస్కారాలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ఓ పెంపుడు కుక్కపిల్ల అదృశ్యమవడంతో దాని యజమాని నిద్రాహారాలు మాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. చివరికి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కుక్కపిల్లను దొంగిలించిన నిందితుడిని పట్టుకున్నారు. దానిని తిరిగి అప్పగించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. చాలా సంఘటనల్లో ఇప్పుడు తమ పెంపుడు జంతువులకు ప్రత్యేక స్థానం ఇస్తున్నారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకోవడమే కాకుండా ఎవరైనా వాటిని పేరుతోకాకుండా మరొలా పిలిస్తే గొడవకు దిగుతున్నారు. జంతువులపై తమ అనంతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు. తారల ఇంట అనుబంధం.. కొన్ని నెలల క్రితం తెలుగు ఇండస్ట్రీకి చెందిన రవిబాబు పందిపిల్లతో ఓ ఏటీఎం క్యూలైన్లో నిలబడి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. సినిమా కోసం ఇది చేసినా.. దానిని తాను పెంచుకుంటున్నట్లు చెప్పారు. ఇక రాంచరణ్ వద్ద పదుల సంఖ్యలో గుర్రాలు, కుక్కలు, ఒంటె వంటి జంతువులు, కోడి పుంజుతో సహా పక్షులే ఉన్నాయి. హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే పిచ్చిప్రేమ. దర్శకుడు పూరీ జగన్నాథ్ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన వద్ద దేశవిదేశీ పక్షులు, జంతువులు చాలానే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, నాగార్జున, ప్రభాస్, త్రిష, అనుష్క, సోనమ్ కపూర్.. ఒకరేమిటి.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షూటింగ్‌లు మినహాయిస్తే ఎక్కువ సమయాన్ని తమకు ఇష్టమైన జంతువులు, పక్షులతోనే గడుపుతున్నారు. -
పప్పీతో జర్నీ.. నో ఎంట్రీ..
పెంపుడు జంతువుల తోడుగా మెట్రో జర్నీ చేద్దామంటే కుదరదని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ స్పష్టంచే సింది. త్వరలో నగర మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్న దృష్ట్యా ఆయా స్టేషన్లలో ప్రయాణికులు చేయకూడని, చేయాల్సిన పనుల జాబితాను ఎల్అండ్టీ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ శివానంద నింబార్గీ మంగళవారం విడుదల చేశారు. ఇందులో పలు కీలక అంశాలున్నాయి. స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ.. ♦ మీ చేతిలో లేదా బ్యాగులోని చెత్తను విధిగా చెత్తకుండీలోనే వేయాలి. స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ. ♦ మెట్రోస్టేషన్ పరిసరాలకు చేరుకున్న తరవాత మీ ప్రయాణానికి సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో వినిపించే అనౌన్స్మెంట్లను జాగ్రత్తగా వినాలి. ♦ మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్ సర్వీస్ బృందం, స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి. ♦ మెట్రో స్టేషన్ లేదా బోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమానిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి. ♦ స్టేషన్‌లోనికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ♦ తోటి ప్రయాణికులు, మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్‌తో మర్యాదగా ప్రవర్తించాలి. ♦ మెట్లు,ఎస్కలేటర్లపై వెళుతున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి. ♦ మీరు దిగాల్సిన స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోవాలి. ♦ ఎస్కలేటర్‌పై ప్రయాణిస్తున్నప్పుడుఎడమవైపు మాత్రమే ఉండాలి. ♦ బోగీలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిలబడాలి. ♦ చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూర్చునేందుకు మీ వంతుగా సహకరించాలి. ♦ చిన్నారులను తీసుకొచ్చే బేబీ బగ్గీస్, వీల్చైర్లలో వచ్చేవారు విధిగా ఎలివేటర్లలో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లాలి. ♦ ఎస్కలేటర్ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి. ♦ టిక్కెట్ కౌంటర్, టిక్కెట్ విక్రయ యంత్రాలు, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్లో నిలబడాలి. ♦ రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే బోగీలోనికి ప్రవేశించాలి. ♦ రైలులో ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపమన్నప్పుడు వారికి సహకరించాలి. టిక్కెట్ లేని ప్రయాణికులపై కఠిన చర్యలు తప్పవు. చేయకూడని పనులివే.. ♦ స్టేషన్లు, పరిసరాల్లోను, బోగీల్లోనూ ఉమ్మివేయడం, సిగరెట్లు తాగడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ తాగడం పూర్తిగా నిషిద్ధం. ♦ రైలుల్లోకి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయరాదు. ♦ ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు. ♦ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు. ♦ మీ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషిద్ధం. ♦ ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్ పరిసరాల్లోకి, బోగీల్లోకి అనుమతించరు. ♦ ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు. ♦ ప్లాట్‌ఫాంపై రైలు కోసం వేచివుండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి రావద్దు. ♦ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా రైలు డోర్లు తెరవరాదు. డోర్లకు ఆనుకొని నిల్చోరాదు. రైలు కోసం పరిగెత్తరాదు. ♦ మీ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్ పరిసరాల్లో విడిచిపెట్టరాదు. ♦ ట్రాక్‌పై ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్ వైర్లను ఎట్టిపరిస్థితుల్లో తాకరాదు. ♦ మెట్రో రైలు పరిసరాల్లోకి భద్రతా ధ్రువీకరణ లేని ఆయుధాలు తీసుకురావద్దు. ♦ చూపులేని వారి కోసం స్టేషన్లో ఏర్పాటు చేసిన టైల్స్‌పై ఇతరులు నడవరాదు. ♦ అత్యవసర కమ్యూనికేషన్ సాధనలతో రైలు డ్రైవర్‌తో సంభాషించరాదు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వారితో సంప్రదించాలి. ♦ మెట్రోస్టేషన్ రైలు, పరిసరాల్లో హాకర్స్‌కు ప్రవేశం నిషిద్ధం. ♦ బోగీ డోర్లు తెరచుకునే.. మూసుకునే సమయాల్లో వాటి మధ్యలో నిలవరాదు. ♦ బోగీలకు ఎలాంటి నోటీసులు అంటించరాదు. ♦ స్టేషన్, బోగీ పరిసరాలను పాడుచేసిన వారు శిక్షార్హులు. ♦ రైలు గమనాన్ని అడ్డుకునే చర్యలపై కఠిన చర్యలు తప్పవు. ♦ మీ దగ్గర ఉన్న స్మార్ట్‌కార్డు లేదా టోకెన్‌ను తోటి ప్రయాణికులతో పంచుకోవద్దు. -
కుక్క.. పనులన్నీ ఎంచక్కా..
పెంపుడు జంతువులను ఎవరైనా పెంచుకుంటారు. కానీ చాలా తక్కువ మందే వాటిని డిఫరెంట్‌గా పెంచుతారు. ఈ కోవలోకే వస్తాడు ఈ శునకాల యజమాని. అవును వాటిని అలా ఇలా పెంచలేదు ఎంతో ప్రత్యేకంగా పెంచాడు మరి. పూడిల్స్ మాక్స్, రూబీ అనే ఈ కుక్కలు వాటికి అవే సాటి! వాటి పనులు అవే చేసుకునేలా మాక్స్, రూబీలు శిక్షణ పొందాయి. ఓ ట్రైనర్‌ను ఏర్పాటు చేసి మరీ శిక్షణ ఇప్పించాడు వీటి యజమాని. పొద్దున లేచినప్పటి నుంచి వాటికి కావాల్సిన అన్ని పనులను ఎంచక్కా అవే చేసేసుకుంటాయి. వాటికి ఎంతో ఇష్టమైన కేకులను తయారు చేసుకుంటాయి. వాటి గదిని శుభ్రం చేసుకుంటాయి. అంతేకాదు ఇంట్లో ఫుడ్ నచ్చకపోతే బయటకు వెళ్లి రెస్టారెంట్లలో భోంచేసి వస్తాయి. బోర్ కొట్టినపుడు బైక్‌పై చక్కర్లు కొడతాయి.. ఊయల ఊగుతాయి.. పియానో వాయిస్తాయి.. ఒక్కటేమిటి అవి చేసే పనులకు వాటి యజమాని ఉబ్బితబ్బిబ్బయిపోతుంటాడు. వాటి పేరు మీద ప్రత్యేకంగా ఇన్స్టాగ్రాం ఖాతా తెరిచి ఎప్పటికప్పుడు ఫొటోలను అప్లోడ్ చేస్తుంటాడు. వీటికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తక్కువేంలేదు.