కుక్కకాటు వేసి ఓ వ్యక్తి గాయపడినందుకు ఆ కుక్క యజమానికి వెయ్యి రూపాయల జరిమానా, గాయపడ్డ బాధితుడికి రూ.800 ఆసుపత్రి ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కుక్కకాటు వేసి ఓ వ్యక్తి గాయపడినందుకు ఆ కుక్క యజమానికి వెయ్యి రూపాయల జరిమానా, గాయపడ్డ బాధితుడికి రూ.800 ఆసుపత్రి ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం....అల్కాపురి యాదవనగర్‌కాలనీలో నివాసముండే రాజేశ్వరాచారి 2014, జనవరి 24న వాకింగ్‌కు వెళ్తుండగా అదే ప్రాంతంలో నివాసముండే మహిళ వేదాంతంశెట్టి పెంపుడు కుక్క రాజేశ్వరాచారిని కరిచి గాయపరిచింది.
దీంతో బాధితుడు ఎల్‌బీనగర్ పోలీసులకు కుక్క యజమానిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్క యజమానురాలిని రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.