రూ.49 లక్షలు కళ్లజూడటంతో పట్టాలు తప్పిన బుద్ధి.. బ్యాంకులో వెయ్యమంటే | Driver Deceives Owner and Flees With Money, Caught by Police | Sakshi
Sakshi News home page

నమ్మి చేతికి రూ.49 లక్షలు ఇచ్చిన యజమాని, పక్కా ప్లాన్‌తో కారుతో సహా పరార్‌! ట్విస్ట్‌ మామూలుగా లేదుగా

Published Wed, May 31 2023 6:30 PM | Last Updated on Wed, May 31 2023 8:59 PM

Driver Deceives Owner and Flees With Money, Caught by Police - Sakshi

లక్నోకు చెందిన ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ యజమాని తన డ్రైవరుకు రూ. 49 లక్షలు నగదునిచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమని చెబితే ఆ డ్రైవర్ అతితెలివితేటలు ప్రదర్శించి డబ్బులతో సహా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో కంపెనీ యజమాని పోలీసులను ఆశ్రయించగా లక్నో పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టి హజరత్  గంజ్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.    

సినీ ఫక్కీలో చోరీకి ప్లాన్... 
ఆ మధ్య ఒక సినిమాలో హీరోని "నమ్మినవాడిని ఎలా మోసం చేశావ్?" అని అడిగితే, సదరు హీరో చాలా సింపుల్ గా నమ్మాడు కాబట్టే మోసం చేశానని అంటాడు. దీన్నే ఆచరణలో పెట్టి లక్నోకు చెందిన ఓ డ్రైవర్ తనను నమ్మిన యజమానిని మోసం చేసి డబ్బు చోరీ చేయాలని పథకం రచించాడు. 

రంగంలోకి పోలీసులు... 
ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలో డ్రైవరుగా పనిచేస్తోన్న రాహుల్ కు ఆ కంపెనీ యజమాని రూ. 49 లక్షలు ఉంచిన రెండు బ్యాగులను ఇచ్చాడు. ఊహించని విధంగా భారీమొత్తంలో డబ్బు చేతికందడంతో ఆ డ్రైవరుకు బుద్ధి పట్టాలు తప్పింది. ఎంత కష్టపడినా ఇంత  పెద్ద మొత్తంలో డబ్బుని సంపాదించడం కష్టం అనుకుని అప్పటికప్పుడు డబ్బుతో సహా ఊరు దాటే ప్రయత్నం చేశాడు.

అంతలోనే కంపెనీ యజమాని పోలీసు కంప్లైంట్ ఇవ్వగా... రంగంలోకి  దిగిన పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టి లక్నో నడిబొడ్డున ఉన్న హజరత్ గంజ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుని గుర్తించారు. పోలీసు బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకొని కారులోనే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడు దోచుకున్న మొత్తం సొమ్మను రికవర్ చేసినట్లు తెలిపారు లక్నో డీసీపీ వినీత్ జైస్వాల్.         

బ్లాక్ మనీ కాబట్టి కంప్లైంట్ ఇవ్వరనుకున్నా... 
ఎలక్ట్రానిక్స్ కంపెనీ యజమాని పూర్వ భుగ్రా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో యజమాని నమ్మకాన్ని వమ్ము చేసినందుకు IPC 408 సెక్షన్, నిజాయతీగా వ్యవహరించనందుకు IPC 411  సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు డీసీపీ. విచారణలో రాహుల్ చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు.

నేను చాలా కాలంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది కాబట్టి నాకు ఇచ్చింది  బ్లాక్ మనీ అయి ఉంటుందనుకున్నా. ఈ సొమ్మును దోచుకున్నా కూడా యజమాని ఎవ్వరికీ చెప్పుకోలేరనుకున్నానని అన్నాడు. కానీ యజమాని పోలీసులను ఆశ్రయించడంతో డ్రైవర్ ఖంగుతిన్నాడు. అత్యాశకు పోయినందుకు తగిన మూల్యం చెల్లించి కటకటాల పాలయ్యాడు.         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement