
ఉద్యోగిని కొడుతున్న సలీం ఖాన్ (ఇన్‌సెట్‌లో) సలీం ఖాన్
కర్ణాటక ,యశవంతపుర : ప్రైవేట్ భద్రత సంస్థకు చెందిన యజమాని తన వద్ద పని చేస్తున్న ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. సంస్థ యజమాని సలీమ్‌ఖాన్ తన వద్ద పనిచేస్తున్న గార్డుపై ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. దీనిని అక్కడే పనిచేస్తున్న సిబ్బంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు సలీం ఖాన్‌పై నిప్పులు కక్కుతున్నారు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సిబ్బందిని ఎందుకు ఇంత దారుణంగా కొట్టాల్సి వచ్చిందో తెలియటం లేదు. ఈ ఘటన బెంగళూరు సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసులో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment