మంగళూరు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
కర్నాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్ బస్సును లెస్టర్ కటీల్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లో ఉన్నాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్‌బిద్రి మార్గంలో నడుపుతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టాడు. కటీల్‌లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోంది. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్ పేరు ఎందుకు పెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సు పేరు మార్చాలని యజమానికి సూచించారు. దీంతో బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు.
ఇది కూడా చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు
Comments
Please login to add a commentAdd a comment