
జెరూసలేం: విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో ప్రయోగాత్మకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇజ్రాయెల్‌లో బెన్నెట్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించింది. రద్దు ప్రతిపాదనను గురువారం పార్లమెంటు ఆమోదించింది. దీంతో నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్ ప్రధాని పదవి కోల్పోయారు. విదేశాంగ మంత్రి యాయెర్ ల్యాపిడ్ ఎన్నికల వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారు. 2021 మార్చిలో ఆఖరిసారిగా ఎన్నికలు జరిగాయి. 120 సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంటుకి నాలుగేళ్లలోనే నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment