Bollywood Actor Sonu Sood Shared His Tailor Shop Video Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

సోనుసూద్‌ టైలర్‌ షాప్‌.. ప్యాంట్‌ కాస్త నిక్కర్‌ కావొచ్చు

Published Sat, Jan 16 2021 2:49 PM | Last Updated on Sat, Jan 16 2021 7:14 PM

Sonu Sood Opens Tailor Shop In Viral Video - Sakshi

వెండితెరపై విలన్‌గా ఆకట్టుకున్న సోనూసూద్‌ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ‘రియల్‌ హీరో’ అయిపోయాడు. ఎక్కడ ఏ ఆపద ఉన్నా.. నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సాయం అందిస్తున్నాడు. వలస కార్మికులు మొదలు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు.. వెంటనే తనకు చేతనైనా సాయం అందిస్తూ తన ఊదారతను చాటుకుంటున్నాడు.
(చదవండి : పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!)

ఇక ఈ రియల్‌ హీరో సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్‌ మీడియా ద్వారనే సమస్యలు తెలుసుకొని సహాయం అందిస్తుంటాడు. ఇక తాజాగా ఈ రియల్‌ హీరో కాస్త టైలర్‌గా మారాడు. కుట్టు మిషిన్‌ సాయంతో దుస్తులు కుడుతున్న వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘సోనూసూద్‌ టైలర్‌ షాపు. ఇక్కడ ఉచితంగా దుస్తులు కుట్టబడును. కానీ ప్యాంట్‌ కాస్త నిక్కర్‌గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందించారు. ‘నా దుస్తులు ఇక్కడ కుట్టించుకోవాడానికి నేను ఏం చెయ్యాలి’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ‘సోనూ అన్న.. ఫ్యాంట్‌ నిక్కర్‌ అవుతుందా.. ఏం పర్లేదు’అంటూ లాఫింగ్‌ ఎమోజీ పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement