రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అర్థరాత్రి రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకోవడంతో అదే దారిన పోతున్న సోనూసూద్ తనకెందుకులే అని ఊరుకోలేదు. తక్షణమే స్పందించి కారులో ఇరుక్కుపోయిన బాధితుడిని తన కారులో ఆస్పత్రికి తరలించారు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దటీజ్ సోనూసూద్, సూపర్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పంజాబ్‌లోని మోగా నగరంలోని కొట్కాపురా బైపాస్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న గాయపడిన వ్యక్తిని సోనూసూద్ గమనించారు. తన టీమ్ సభ్యులతో కలిసి గాయపడిన వ్యక్తిని కారులోంచి బయటకు తీసి అన్‌పీ ల్యాప్‌లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో తగిన చికిత్స లభించడంతో ప్రస్తుతం గాయపడిన 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మెరుగైన వైద్యం అందుతోంది.
కాగా కరోనా మహమ్మారి విజృంభించిన దశ మొదలు గత రెండేళ్ల కాలంగా బాధితులకు అండగా నిలుస్తున్నారు సోనూసూద్. మొదటి దశలో వలస కార్మికులకు సోనూ విశేష సేవలు పలువురి ప్రశంసలు దక్కించుకున్నాయి. అలాగే రెండో దశలో కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, మందులు అంద జేయడంతోపాటు ఆన్‌లైన్ చదువులకోసం ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులకు ఆయన అందించిన అండదండలు అమోఘంగా నిలిచిన సంగతి తెలిసిందే.
Accident of 2 vehicles occured in Moga. Sonu Sood himself took out the unconscious boy from the car and took him to the hospital in his car. #sonusood pic.twitter.com/BM7fjvighU
— Gagandeep Singh (@Gagan4344) February 8, 2022
Comments
Please login to add a commentAdd a comment