ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్ | A Video Of 2 Year Old Girl With Four Arms And Legs Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్

Published Sun, May 29 2022 12:09 PM | Last Updated on Sun, May 29 2022 12:09 PM

A Video Of 2 Year Old Girl With Four Arms And Legs Goes Viral - Sakshi

ఇంతవరకు అవిభక్త కవలల్లా జన్మించిన వాళ్లను చూశాం. చాలా మంది పిల్లలు జన్యులోపం కారణంగానో లేక మరేఇతర కారణాల వల్లనో శరీరంలో ఏదో ఒక అవయవం గానీ లేదా నడుం భాగం నుంచి అతుక్కుని పుట్టిన వాళ్లని చూశాం. కానీ ఇక్కడో అమ్మాయి మాత్రం చాలా విచిత్రంగా జన్మించింది. ఆ చిన్నారికి ఏకంగా నాలుగు కాళ్లు,  నాలుగు చేతులతో జన్మించింది.

వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని నెవాడా జిల్లాకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి నాలుగు కాళ్లు, చేతులతో జన్మించింది. ఆ చిన్నారి కుటుంబం వైద్యం చేయించే స్థోమతలేని పేద కుటుంబం. ఐతే ఆ చిన్నారికి చేతులు కాళ్లు ఆమె పొట్టభాగానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ మేరకు ఆ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వడంతో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సోను సూద్‌ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతేకాదు ఆ చిన్నారికి వైద్యం అందుతున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమే కాకుండా ఆ చిన్నారి త్వరగా నయమవ్వాలని ప్రార్థించండి అని ట్వీట్‌ చేశారు.

(చదవండి: వీడియో: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement