Sonu Sood Shared Gym Video Going Viral - Sakshi
Sakshi News home page

Sonu Sood: లేటెస్ట్‌ వీడియో... ఫ్యాన్స్‌ ఫిదా

Published Tue, Oct 19 2021 3:55 PM | Last Updated on Tue, Oct 19 2021 4:30 PM

Sonu Sood shared gym video its going viral - Sakshi

సాక్షి, ముంబై: రియల్‌ హీరో సోనూసూద్‌ మరోసారి ఫ్యాన్స్‌ను  ఫిదా చేశారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ, తీవ్రమైన వర్కౌట్స్‌ చేస్తూ.. కండలు తిరిగిన చక్కటి బాడీతో  ఆకట్టుకోవడం ఆయనకు అలవాటు. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు.  వావ్‌.. అంటూ ఫ్యాన్స్‌ కమెంట్‌ చేస్తున్నారు.  లక్షా 90వేలకు పైగా లైక్స్‌తో ప్రస్తుతం ఈ వీడియో  నెట్టింట  చక్కర్లు కొడుతోంది. 

సోనూ సూద్‌కు ఇష్టమైన ప్రదేశం జిమ్‌. జిమ్‌లో వర్కవుట్ చేసిన తరువాతే మరే పనైనా అన్నట్టు కసరత్తుకు ప్రాధాన్యత ఇస్తారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో తరచూ షేర్‌ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం ఫిట్‌నెస్‌ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ  వీడియోలు, కుమారుడు ఇషాన్ సూద్‌తో కలిసి చేసిన కసరత్తు  తెగ హల్‌చల్‌ చేసిన సంగతితెలిసిందే. పుల్-అప్‌ అయినా, లెగ్ రైజ్‌ అయినా అలా అలవోకగా చేసి పారేయ్యగల శారీరక ధారుడ్యం అతనిది.   (Manike Mage Hithe: యొహానీకి బాలీవుడ్‌ బంపర్‌ ఆఫర్‌)

తాజాగా తన జిమ్ డైరీల నుండి మరొక స్నిప్పెట్‌ను  అభిమానులతో పంచుకున్నారు.  "డైలీ గ్రైండ్"  అంటూ  ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్‌ చేసిన వీడియో ఫ్యాన్స్‌ను ఫిదా  చేస్తోంది. రాడ్‌కు వేలాడుతూ పుల్‌ అప్‌ చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు.  తను ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశాన్ని వర్కవుట్ స్పేస్‌గా మార్చేయగల సత్తా సోనూ సూద్‌ సొంతం. గతంలో ఆయన షేర్‌ చేసిన ఎస్కలేటర్‌ వీడియోనే ఇందుకు సాక్ష్యం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement