విమాన ప్రయాణంలో వింతలు, రోత పుట్టించే సంఘటనలు జరగడం అరుదేం కాదు. అప్పుడప్పుడు కొందరు తమ వికృత చేష్టలతో తోటిప్రయాణికులు బిత్తరపోయేలా చేసిన ఘటనలు కోకొల్లలు. తాజాగా రష్యాలోని మాస్కోకు వెళుతున్న ఓ విమానంలో ఓ మహిళ తన చర్యతో తోటి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రయాణికులతో నిండిపోయిన విమానంలో ఎంచక్కా సీటులో కూర్చొని.. ఆ మహిళ ఓ అండర్‌వేర్‌ను ఆరబెట్టింది. ప్రయాణికులందరికీ కనిపించేలా పైన ఉన్న ఏసీగాలి తగిలేలా అండర్‌వేర్‌ను ఎత్తిపట్టి.. దానిని తీరిగ్గా ఆరబెట్టింది.
ప్రయాణికులందరూ ఈ వికృత చర్యను చూస్తూ మిన్నకుండిపోయారు. ఎవరూ ఇదేమిటని ఆమెను ప్రశ్నించలేదు. ఈ నెల 14న టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు వెళుతున్న యూరల్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వెనకు సీటులో కూర్చున్న ప్రయాణికుడు రికార్డు చేసి.. రష్యాకు చెందిన ‘ఫస్ట్ టులా’ వెబ్‌సైట్‌కు ఇచ్చాడు. ఆ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఏసీ వెంట్ నుంచి గాలి బాగా తగిలేలా పట్టుకొని ఆమె తెల్లరంగు అండర్‌వేర్‌ను ఆరబెట్టుకుంది. అయితే, ఆమె వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనను చూస్తూ విస్మయపోయానని తోటి ప్రయాణికులు మీడియాతో తెలిపారు.
ఫ్లయిట్‌లో అందరూ బిత్తరపోయేలా చేసింది!
Published Tue, Feb 20 2018 2:02 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment