ఫోన్ కొట్టు.. పరిష్కారం పట్టు | Hello Sakshi | Sakshi
Sakshi News home page

ఫోన్ కొట్టు.. పరిష్కారం పట్టు

Published Tue, Nov 18 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

వైకుంఠపురంలో కాంతులీనుతున్న వీధిదీపం

వైకుంఠపురంలో కాంతులీనుతున్న వీధిదీపం

 హలో సాక్షికి స్పందన
 వీధిలో లైటుపోయినా.. మంచినీటి కుళాయి మరమ్మతులకు గురైనా.. మురుగు సమస్య పరిష్కారం కాకున్నా.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందిపడిన జనానికి ‘హలో సాక్షి’ సాంత్వననిస్తోంది. ఒక్క ఫోన్ చేసి సమస్యను సాక్షికి వివరిస్తే పరిష్కారమవుతుందన్న నమ్మకం జనానికి కలిగింది. ఇందుకు నిదర్శనమే హలోసాక్షికి లభిస్తున్న స్పందన.
 
 చీరాల రూరల్ : నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు సాక్షి దినపత్రిక హలో సాక్షి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన  వస్తోంది. ప్రజలు తమ సమస్యలను సాక్షికి వివరిస్తున్నారు. సమస్యపై సాక్షిలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందిస్తున్నారు. దీంతో ప్రజలు సాక్షికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
 
 సమస్యల పరిష్కారం..
 వేటపాలెం : నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు సాక్షి చేపట్టిన హలో సాక్షి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి చోట ఉండే వీధి దీపాల సమస్య, మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులను సాక్షి చొరవతో అధికారులు పరిష్కరిస్తున్నారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విజయనగర్ కాలనీ నుంచి ఎస్సీ బాలికల వసతి గృహం ముందు రోడ్డు గుండా చీరాల-ఒంగోలు ప్రధాన రోడ్డుకు వచ్చే మార్గంలో వీధి దీపాలు పాడైపోయాయని స్థానికులు సాక్షి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హలోసాక్షి సమస్యను పంచాయతీ కార్యదర్శి కృష్ణ దృష్టికి తీసుకెళ్లగా వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని శారదాకాలనీ మొదటి లైను రోడ్డులో తాగి పడేసిన కొబ్బరి బోండాల వ్యర్థాల వల్ల దోమల బెడద పెరిగిందని కాలనీ వాసులు శ్రీనివాసరావు సాక్షి దృష్టికి  తీసుకువచ్చారు.

ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి కృష్ణ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి సాక్షి చొరవ చూపింది. వేటపాలెం 8వ వార్డులోని పాకనాటి వీధిలో వీధిదీపాలు వెలగడం లేదని స్థానికులు సాక్షి దృష్టికి తీసుకురాగా హలోసాక్షిలో సమస్య ప్రచురితం కావడంతో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ బాబు స్పందించి వీధిదీపాలకు మరమ్మతులు చేయించారు. నాయిన పల్లి ఫకీర్ వీధిలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు సాక్షి దృష్టికి తెచ్చారు. సమస్యపై వార్త ప్రచురితం కావడంతో పందుల పెంపకందారులకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ నోటీసులు పంపారు.
 
 వీధి దీపాలు వెలిగాయి..
* బుర్లవారిపాలెంలోని సాయికాలనీ ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ దీపాలు 4 రోజులుగా వెలగడం లేదని  స్థానికురాలు బి.పద్మ సాక్షి దృష్టికి తీసుకువచ్చారు. దానిపై కథనం ప్రచురితం కావడంతో అధికారులు సమస్యను పరిష్కరించారు.
* పట్టణంలోని 15 వార్డులోని బెస్తపాలెంలో రామమందిరానికి వెళ్లేదారిలో పది రోజుల నుంచి వీధి దీపాలు వెలగడం లేదని స్థానికుడు పి.ప్రసాద్ హలోసాక్షికి వివరించారు. ఆ వార్తను ప్రచురించడంతో పరిష్కారం లభించింది.
* సమస్య : దండుబాట రోడ్డు, వైకుంఠపురంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడంలేదని కె.సింగారావు హలోసాక్షి దృష్టికి తీసుకువచ్చారు. సాక్షిలో కథనం రావడంతో సమస్యకు పరిష్కారం లభించింది.
* సమస్య : చీరాలనగర్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ దీపాలు 3 రోజులుగా వెలగడం లేదని ఎ.శ్రీనివాసరెడ్డి సాక్షి దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారమైంది.
 
 బాగుపడిన వీధులు..
*  పేరాల హైస్కూల్ వెనుకవైపు ఉన్న మురుగు కాలువలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని ఎస్‌కే సత్తార్ సాక్షికి వివరించడంతో కథనం ప్రచురితమైంది. దీంతో మురుగు కాలువలు బాగుపడ్డాయి.
*  ఈపూరుపాలెంలోని పద్మనాభునిపేటలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఎం.రవికుమార్ సాక్షి దృష్టికి తీసుకురావడంతో కథనం ప్రచురితమైంది. దీంతో సమస్యకు పరిష్కారం లభించింది.  
*  సాల్మన్ సెంటర్ పంచాయతీలోని నవాబుపేటలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఎస్‌కే మస్తాన్ సాక్షికి వివరించారు. సమస్యపై వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు.
* పట్టణంలోని రామ్‌నగర్, వీవర్స్ కాలనీల్లోనిమున్సిపల్ ట్యాప్‌ల నుంచి మంచినీరు సక్రమంగా రావడంలేదని స్థానికుడు శివన్నారాయణ సాక్షి దృష్టికి తీసుకువచ్చారు. హలోసాక్షిలో సమస్యపై వార్త ప్రచురితం కావడంతో పరిష్కారం లభించింది.
* చీరాల ఆంధ్రాబ్యాంక్ రోడ్డులో పైపులు వేసేందుకు మట్టిని తవ్వి రోడ్డుపై వేయడంతో అందరికీ ఇబ్బందిగా ఉందని  స్థానికుడు కె.సురేంద్ర సాక్షి దృష్టికి తెచ్చారు. సమస్యను ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కరించారు.

మీ ప్రాంత సమస్యలు పరిష్కరించుకోండి
 
 వీధిలైట్లు వెలగడం లేదా, చెత్త పేరుకుపోయినా పట్టించుకోవడం లేదా, మురుగు నీరు బుసలు కొడుతోందా... పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయా? ... ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారా...ఎవరికి చెప్పాలనే అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారా...? ఇంకెందుకు ఆలస్యం ... మీ ఇక్కట్లను తొలగించే ప్రయత్నానికి ‘సాక్షి’ నడుం బిగించింది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా  మీ పరిసర ప్రాంతవాసులు చవిచూస్తున్న సామాజికపరమైన ఇబ్బందులను కింద ఉన్న సెల్ నంబర్లకు ఫోన్ చేసి సవివరంగా తెలియచేయండి. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుంది మీ ‘హలో సాక్షి’.  
 చీరాల టౌన్ :
 సమస్య : తోటవారిపాలెం గ్రామంలోని వీవర్స్ కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రాత్రి వేళల్లో ఒంటరిగా నడిచివెళ్లే వారిపైకి వస్తున్నాయి. ప్రజలను గాయాలపాలు చేస్తున్న వీధి కుక్కలను గ్రామం నుంచి తరిమేయాలి.     
 - కె.శ్రీనివాసరావు, స్థానికుడు.
 సమాధానం : పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.
 - పి.శంకరరెడ్డి, ఈవోఆర్డీ, చీరాల
 సింగరాయకొండ:
 సమస్య : స్వచ్ఛభారత్ పేరుతో ప్రభుత్వాస్పత్రి వద్ద రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు తొలగించారు కానీ సమీపంలోని చేపల మార్కెట్ వద్ద రోడ్డుమార్జిన్లలో ఉన్న ముళ్లచెట్లను తొలగించ లేదు. వాటిని తొలగించండి.         -షేక్ నజీర్,సింగరాయకొండ.
 సమాధానం : ఈ ప్రాంతంలోని ముళ్లచెట్లను వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను.
 - సీహెచ్ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సింగరాయకొండ.
 
 సమస్య : ఎస్సీ కాలనీల్లోని సైడు కాలువల్లో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న మురుగు నిలుస్తోంది. ఊరు చివర వరకు  పారేలా చర్యలు తీసుకోవాలి.                - పి.విజయచంద్ర, కొండపి గ్రామస్థులు.
 సమాధానం : సైడు కాలువల్లో మురుగు ముందుకు పారేందుకు చర్యలు తీసుకుని కాలనీ వాసుల ఇబ్బందులు తొలగిస్తాం.               
 - సాంబయ్య, కార్యద ర్శి
 
 మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు:
 చీరాల : 9705348102,
 చీరాల అర్బన్ : 9030627609,
 చీరాల టౌన్: 9291373791,
 చీరాల రూరల్: 9885080777,
 వేటపాలెం : 9705347568.
 దర్శి : 98855 88559,
  తాళ్లూరు : 97053 47580
 కురిచేడు : 94401 40522,  
 ముండ్లమూరు : 97053 47581,
 దొనకొండ : 9705347600
 గిద్దలూరు 97053 47591
 కంభం 73962 29222
 గిద్దలూరు రూరల్ 9704672501
  రాచర్ల 9848877148  
 కొమరోలు 73961 16400
  బేస్తవారిపేట 9705347593
 కనిగిరి : 9705347570
 పామూరు : 9440560707,
 సీఎస్ పురం : 8978448089,
 హనుమంతునిపాడు : 9705944299,
  పీసీ పల్లి :  9951574214
   వెలిగండ ్ల: 7731973918
 కందుకూరు : 9010937913
 ఉలవపాడు : 9912249239,
 కందుకూరు అర్బన్ : 9491708133
 కందుకూరు రూరల్ : 9951850046
 వలేటివారిపాలెం : 9705800861
 గుడ్లూరు : 9652774450
 లింగసముద్రం : 9705347559
 కొండపి : 99491 03696
  టంగుటూరు : 97053 47550,
 సింగరాయకొండ: 81251 93100
 పొన్నలూరు: 97053 47562
 మర్రిపూడి: 97053 47597
 జరుగుమల్లి: 99128 77391.    
 పర్చూరు : 7386550989
  ఇంకొల్లు : 9949112302
 కారంచేడు : 9299998836
  చినగంజాం : 9989348359
 యద్దనపూడి -9493924570
  మార్టూరు : 9440786558   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement