సమస్యలు విన్నవించిన బాధితులకు సీఎం జగన్ భరోసా
సావధానంగా ఆలకించి అర్జీలను స్వీకరించిన సీఎం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, వృద్ధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ సమస్యలు విన్నవించి ఆదుకోవాలని అభ్యర్ధించారు. వారి కష్టాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్ ప్రతి ఒక్కరి నుంచి అర్జీలను స్వీకరించారు. ‘‘బాధపడొద్దు.. నేను ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తా’’ అని భరోసా ఇచ్చి అర్జీలను వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. – సింగరాయకొండ (మర్రిపూడి) పొన్నలూరు/పీసీపల్లి
టీడీపీ వాళ్లు పొలం కబ్జా చేశారయ్యా..
మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన రాయిపాటి లక్ష్మీనరసయ్య (70) వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పదేళ్ల పాటు గడ్డం పెంచాడు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. దీనిపై కక్షగట్టిన టీడీపీ సానుభూతిపరులు లక్ష్మీనరసయ్యకి చెందిన 9 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు. బస్సు యాత్ర సందర్భంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తేవడంతో పెద్దాయన సమస్యను నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యోగం కోసం వినతి
2017లో బీకాం చదివిన పీసీపల్లి మండలం అలవలపాడు కొత్తూరుకు చెందిన రావి సురేష్ ప్రస్తుతం వలంటీర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా ఉన్నందున ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశాడు.
ట్రై సైకిల్ ఇప్పించండన్నా
బస్సు యాత్ర కనిగిరి మండలం అజీజ్‌పురానికి చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన కేశారపు దేవమ్మ అనే దివ్యాంగురాలు సీఎం జగన్‌ను కలిసింది. దివంగత వైఎస్సార్ గతంలో తనకు ఇచి్చన ట్రైసైకిల్ మూలనపడినందున కొత్తది ఇప్పించాలని విన్నవించింది.
నలుగురు బిడ్డలున్నా...
‘‘చూపు కోల్పోయి పని చేయడానికి వీలు లేకుండా పోయింది. కుటుంబ పోషణ అంతంత మాత్రం. ఆర్థిక సాయం చేయండి సారూ’’ అంటూ కనిగిరి మండలం అజీస్‌పురంలో కేశారపు రోశయ్య వేడుకున్నాడు. తనకు నలుగురు పిల్లలున్నా పట్టించుకోవడం లేదని, ఒంటరినయ్యానని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విలపించాడు.
దివ్యాంగుడిని ఆదుకోండయ్యా
కనిగిరి మండలం ఏరువారిపల్లిలో గ్రామానికి చెందిన లక్కె మంగమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు లక్కె సాయిని వెంటబెట్టుకుని సీఎం జగన్‌ను కలిసింది. మన ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్ వస్తోందని తెలిపింది. తన కుమారుడికి ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విన్నవించింది.
► శారీరక ఎదుగుదల లేని పొన్నలూరు గ్రామానికి చెందిన వెలగపూడి ఏసుబాబు అర్హత ఉన్నా తనకు సదరం సరి్టఫికెట్ మంజూరు చేయడం లేదని, పింఛన్ పొందలేకపోతున్నానని విన్నవించాడు.
► పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి నరసింహం ఎడమ కాలు రోడ్డు ప్రమాదంలో విరిగిపోయింది. తనకు మెరుగైన వైద్యం అందించాలని సీఎంకు విన్నవించాడు.
► కల్లూవారిపాలెం గ్రామానికి చెందిన కప్పల రియాగ్రేస్‌కు రెండు కళ్లు కనిపించకపోవడంతో శస్త్ర చికిత్స చేశారు. అయితే దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స విఫలమైందని, మరోసారి శస్త్ర చికిత్స కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరారు.
► మరికొందరు వృద్ధులు తమకు ఆరోగ్య సమస్యలున్నాయని, వాటిని నయం చేసేందుకు వైద్య సాయం అందించాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment