విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
Published Wed, Dec 21 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ధర్మారావు
జగ్గంపేట : విద్యుత్ వినియోగదారుల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు విద్యుత్ వినియోగదారుల ఫోరం(సీజీఆర్‌ఎఫ్) చైర్మన్, రిటైర్డ్ జడ్జి డి.ధర్మారరావు అన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజనల్ కార్యాలయంలో బుధవారం జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఫోరం చైర్మన్ ధర్మారావు మాట్లాడుతూ డిసెంబరు రెండున తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత 137 ఫిర్యాదులు స్వీకరించి వీటిలో 75 వరకు పరిష్కరించినట్టు తెలిపారు. జగ్గంపేటలో ఐదు డివిజన్లకు సంబంధించి 36 కేసులు రాగా వాటిలో పరిష్కరించామన్నారు. విద్యుత్ వినియోగదారుల ఫోరం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యలు, విద్యుత్ మీటర్ సమస్యలు, కొత్త సర్వీసుల ఇవ్వడంలో జాప్యం తదితర వాటిపై పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలు సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఈ తిలక్‌కుమార్, సిబ్బంది బాలాజీ, రమణారావు, రవికుమార్, విజయ్, మీనకేతనరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement