ముందడుగు..
♦ పరిష్కారం దిశగా ఏళ్లనాటి సమస్యలు
♦ ఆ వైపుగా రెవెన్యూ అధికారుల అడుగులు
♦ ఇప్పటికే దాచారం, అన్నారం గ్రామాలసమస్యల పరిష్కారం
♦ తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై దృష్టి
జిన్నారం : దీర్ఘకాలికంగా ఉన్న భూసమస్యల పరిష్కారానికి మండల రెవెన్యూ అధికారులు చొరవ చూపుతున్నారు. అరవై ఏ ళ్లుగా నానుతున్న దాచారం ఇళ్లస్థలాలు, అన్నారంలో 30 ఏళ్లుగా వేధిస్తున్న రైతుల భూసమస్యను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించారు. తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్లపై దృష్టిసారించారు.
జిన్నారం మండలం దాచారం, దార్గుల గ్రామాలను 60 ఏళ్ల క్రితమే డీఆర్‌డీఓ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ తమకు వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఈ గ్రామాలను వదిలే ప్రసక్తే లేదని దాచారం, దార్గుల వాసులు తేల్చిచెప్పారు. అలా చాలా ఏళ్లుగా ఈ సమస్య నానుతూ వస్తోంది. రెండేళ్ల క్రితం దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కి ష్టాయిపల్లిలోని 166 సర్వే నంబర్ గల భూమిలో 36 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. రెండు నెలల క్రితం దాచారం గ్రామాన్ని డీఆర్‌డీఓ, రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో దాచారం గ్రామాల ప్రజలు రోడ్డున పడ్డారు. వారికి త్వరగా ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన 360 మందిని గుర్తించి ఇళ్ల స్థలాల పట్టాతోపాటు పొజిషన్‌ను కూడా చూపించారు.
అన్నారం సమస్య 30 ఏళ్లది...
అన్నారంలోని 261 సర్వే నంబర్‌లో 30 ఏళ్ల క్రితం 108 మంది రైతులకు ఎకరం చొప్పున సాగు చేసుకునేందుకు భూమి ని అందిస్తూ సర్టిఫికెట్లు అందించారు. ఇదే సర్వే నంబర్‌లో ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు కూడా స్థలాలు కేటాయించారు. అప్పటినుంచి రైతులకు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు పొజిషన్ చూపడంలో అధికారులు విఫలమయ్యారు. సర్వే నంబర్ ఒకటే కావటంతో ఎవరికి ఎక్కడ స్థలాన్ని కేటాయించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలుపడుతూ వచ్చా రు. తహసీల్దార్ శివకుమార్ ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో రైతులతో, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లతో స్వయ ంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ముందుగా స్థలాన్ని కేటాయించి, ఆ తర్వాత ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు కేటాయిస్తామని చెప్పా రు. దీంతో రైతులకు ఎకరం చొప్పున లాట రీ ద్వారా స్థలాన్ని ఎంపిక చేసి అం దజేశారు.దీంతో ఈ సమస్యకు పరిష్కారమైంది. 59జీవో కింద ఆయా గ్రామాల ప్రజలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేం దుకు దరఖాస్తులు చేసుకున్నారు. రెండేళ్లుగా ఈ సమస్య అలాగే ఉంది. ప్రస్తుతం మండల వ్యాప్తంగా 59జీఓలో భాగంగా రిజిస్ట్రేషన్ పనులు వేగంగా జ రుగుతున్నాయి. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుం టున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులను ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.
శాశ్వతపరిష్కారం దిశగా ముందుకు..
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సహకారంతో మండలంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నాం. 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాం. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దాచారం, దార్గుల గ్రామాల ప్రజల సమస్య పరిష్కారం కావటం సంతోషంగా ఉంది. - శివకుమార్, తహసీల్దార్ జిన్నారం