లోక్ అదాలత్‌లో 1,946 కేసుల పరిష్కారం
* కేసుల పరిష్కారంలో మూడోసారి రాష్ట్రంలో ప్రథమ స్థానం
* న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసింహారెడ్డి
గుంటూరు లీగల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలో వరసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించిన అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 1,946 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత ఆధ్వర్యలో నిర్వహించిన అదాలత్‌లో 53 సివిల్ కేసులు, 368 క్రిమినల్ కేసులు, 31 వివాహ సంబంధమైనవి, 8 మోటారు వాహన ప్రమాద కేసులు, 8 లేబర్ కోర్టు కే సులు, 176 విద్యుత్ కేసులు, 1234 ఎస్‌టీసీలు, 50 బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు, 18 ఇతర ప్రీలిటిగేషన్‌లు పరిష్కారమయ్యాయి. రూ.2,82,91,514 పరిహారంగా మంజూరు చేశారు.