గిరిజన సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : గిరిజన సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. రాజమండ్రిలో గురువారం ఆయన విశాఖ జిల్లా అరకు, పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థులు, ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
అరకు, పాడేరు నియోజక వర్గాల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను అభినందించారు. సమీక్షలో అరకు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన కె సర్వేశ్వరరావు, పాడే రు నుంచి ఎన్నికైన గిడ్డి ఈశ్వరి, అరకు ముఖ్యనేతలు సుబ్బారావు, అనంద్, స్వామి, రఘునాథ్, సత్యం, పాండురంగస్వామి, పాడేరు నేతలు నూకరత్నం, పద్మకుమారి, నళినీకృష్ణ, రామదాసు, రమణ, గోవిందరావు, మల్లుపడాల్, చంద్రరావు, రాజబాబు పాల్గొన్నారు.