
అబ్బాయిలు ఉద్యోగాలు దొరక్క పెళ్లి, పిల్లలు వద్దనుకుంటున్నారు. అమ్మాయిలు కెరీర్‌లో పైపైకి ఎదగడానికి పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు. ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇది! ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇరాన్ ఎంత న్యూక్లియర్ పవర్ అయినా, 2050 నాటికి మూడింట ఒక వంతు జనాభా 60 ఏళ్లు పైబడిన వారే అయి ఉండి, ప్రపంచదేశాల దృష్టిలో వృద్ధ దేశంగా మిగిలిపోతుందని ఆ దేశ పాలకులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ వార్షిక జనాభాలో పెరుగుదల ఒక శాతం కన్నా తక్కువకు పడిపోయింది!
ఈ అత్యల్ప స్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో వేసక్టమీలను నిషేధిస్తూ ఇరాన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆసుపత్రులు అందించే కుటుంబ నియంత్రణ సదుపాయాలపైన కూడా ఆంక్షలు విధించింది. 2020 జూన్ 15 నాటికి ఇరాన్ జనాభా 9 కోట్ల 40 లక్షలు. అబ్బాయిలు ఏదో ఒక ఉద్యోగంలే అని సర్దుకుపోవాలి. లేదా అమ్మాయిలు ఎవరో ఒకరులే అని సర్దుకుపోవాలి. ఇరాన్ కోరుకుంటున్నట్లు జనాభా పెరగడానికి ఇది కూడా ఒక మార్గం.
Comments
Please login to add a commentAdd a comment