జనాభా తగ్గింది ఇందువల్లే! | Everything you need to know about Japan's population | Sakshi

జనాభా తగ్గింది ఇందువల్లే!

Published Tue, Sep 20 2016 2:45 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM

జనాభా తగ్గింది ఇందువల్లే! - Sakshi

జనాభా తగ్గింది ఇందువల్లే!

యువతలో 40 శాతం మందికి శృంగారానుభవం లేదని ప్రభుత్వ సర్వేలో తేలింది...

టోక్యో: జపాన్‌లో ఒంటరిగా ఉంటున్న యువతలో 40 శాతం మందికి శృంగారానుభవం లేదని ప్రభుత్వ సర్వేలో తేలింది. సర్వే ప్రకారం.. నాలుగింట మూడువంతుల మంది పురుషులు ఒంటరిగా నివసిస్తున్నారు. జపాన్‌లో జననాల రేటు తగ్గిపోవడానికి ఇదే కారణమని అధికారులు కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే  జపాన్ వృద్ధ దేశం అయిపోతుందని అంటున్నారు. 2015 జూన్‌లో జరిగిన ఈ  సర్వేలో జాతీయ జనాభా సంస్థ, సామాజిక భద్రతా పరిశోధనా విభాగాలు 18-34 ఏళ్ల మధ్య 5వేల మందికి పైబడిన వారిని ప్రశ్నించాయి.

పురుషుల్లో 42 శాతం మంది, స్త్రీల్లో 44 శాతం మందికి ఇంతవరకు శృంగారానుభవం లేదని ఈ సర్వే చెబుతోంది. ఇంతకుముందు 2005లో జరిగిన ఇలాంటి సర్వేలోనే  30 శాతం మందే ఒంటరిగా ఉన్నారని తేలింది. 2015లో జరిగిన సర్వేలో పురుషుల్లో 70 శాతం మంది, స్త్రీల్లో 60 శాతం మంది ఒంటరిగా ఉంటున్నారని తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement