మద్యపానం విషయంలో ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. స్తీలు అధికంగా మద్యపానం చేస్తే పిల్లలు పుట్టరంటూ పోలాండ్ పాలక పక్ష నాయకుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. స్త్రీలు డ్రింక్ చేయడం వల్లే జననాల రేటు తక్కువగా ఉంటుందంటూ వ్యాఖ్యానించాడాయన. పోలాండ్ జనాభా తక్కువగా ఉండటానికి కారణం స్త్రీలు అధికంగా మద్యపానం సేవించడమే ప్రధాన కారణమని అన్నారు.
25 ఏళ్లు వయసు ఉన్న స్త్రీలు.. అదే వయసు ఉన్న పురుషుల కంటే ఎక్కువగా డ్రింక్ చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు పిల్లలు ఉండరన్నారు. పురుషులు తాగుబోతులు అని ముద్ర వేయించుకోవడానికి 20 ఏళ్లు పడితే స్త్రీలకు కేవలం రెండేళ్లు చాలంటూ కామెంట్లు చేశాడు. అంతేగాదు మద్యానికి బానిసైన మగవాళ్లకు చికిత్స అందించి సులభంగా నయం చేయవచ్చు కానీ స్త్రీలను నయంచ చేయలేమని ఇది ఒక వైద్యుడు అనుభవం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా ఇది పితృస్వామ్య రాజ్యమని ప్రూవ్ చేశారంటూ ప్రజలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వాస్తవానికి పోలాండ్‌లోని మహిళలు ఆర్థిక స్థిరత్వం, అబార్షన్ రిస్ట్రిక్షన్స్ దృష్ట్యా పిలలు కనడం పట్ల అంత ఆసక్తి కనబర్చడం లేదనేది ప్రధాన కారణమని నిపుణుల చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment