ముంబై ప్రమాదంపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు | Hema Malini Blames Population for Mumbai Fire | Sakshi
Sakshi News home page

ముంబై ప్రమాదంపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు

Published Fri, Dec 29 2017 5:57 PM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM

Hema Malini Blames Population for Mumbai Fire - Sakshi

సాక్షి, ముంబయి : బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని ముంబయి అగ్ని ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో అగ్ని ప్రమాదానికి కారణం జనాభా అన్నారు. ముంబయిలోకి పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ముంబయిలోని కమలామిల్స్‌ కాంపౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని 14మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే.

దీనిపై మీడియా ప్రతినిధులతో హేమమాలిని పార్లమెంటు వెలుపల మాట్లాడుతూ 'పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదు. వారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. కానీ, ముంబయిలో విపరీతంగా జనాభా ఉంది. ముంబయి ముగిశాక మరోనగరం ప్రారంభం కావాలి. అంతేగానీ, ఈ నగరంలో ఇంకా విస్తరిస్తూనే ఉంది.. నియంత్రణ లేకుండా పోతోంది. ప్రతి నగరానికి జనాభా విషయంలో కొంత పరిమితి అంటూ ఉండాలి. పరిమితి దాటాక ఎవరినీ అనుమతించకూడదు. వారిని వేరే నగరానికి వెళ్లిపోనివ్వాలి... అక్కడ నుంచి మరో నగరానికి వెళ్లనివ్వాలి' అని హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement