parliamanet
-
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ! -
పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే..
నిజామాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా అంటే.. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతుండటం, పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం, నూతన ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకపోవడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసేందుకు సర్కారు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి–1తో ప్రస్తుత పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే గ్రామ పోరును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని అధికారులంటున్నారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు, 4,932 వార్డు స్థానాలున్నాయి. అందులో ఇందల్వాయి మండలంలోని గంగారాం తండా, తిర్మన్‌పల్లి జీపీలకు పలు కారణాలతో ఎన్నికలు జరగలేదు. మరో 13 సర్పంచి స్థానాలు, 175 వార్డు స్థానాలకు ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడ్డాయి. సర్పంచులకు నెలకు రూ. 5వేల గౌరవవేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి చెక్‌పవర్ ఇచ్చింది. రిజర్వేషన్లపై గ్రామస్థాయిలో.. జీపీలకు రిజర్వేషన్ల మార్పుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ప్రస్తుతమున్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాత రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. పదేళ్లపాటు అవే రిజర్వేషన్లు ఉంటాయని చట్టంలో గత ప్రభుత్వం పొందుపర్చింది. ఆ సమయంలో రిజర్వేషన్లు కొందరికి ఖేదం. మరికొందరికి మోదంగా మారాయి. రిజర్వేషన్ల మార్పుపై గ్రామస్థాయి నుంచి ఒత్తిడి వస్తే తప్ప మార్చే పరిస్థితి లేదు. సంకట స్థితిలో సర్పంచులు.. పంచాయతీ పాలకవర్గాలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తున్నారు. ఐదేళ్లలో తాము అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నామని, బిల్లులు రాకపోవడంతో కొందరు కూలీలుగా మారారని, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికమంది సర్పంచులు బీఆర్ఎస్లో ఉండిపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో సర్పంచులు సంకట స్థితిలో ఉన్నారు. ఈ తరుణంలో పర్సన్ ఇన్ఛార్జికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పలుమా ర్లు పర్సన్ ఇన్ఛార్జికి అవకాశమివ్వగా, కొన్నిసార్లు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ప్రస్తుతమున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచిచూడాలి. కాగా ఈవిషయమై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. ఆర్నెళ్లలోపే అవకాశం..! జీపీ పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే ప్రస్తుతమున్న చట్టం ప్రకారం పంచాయతీలకు గ్రాంట్లు నిలిచిపోయే అవకాశముంది. పార్లమెంట్ ఎన్నికలు మే చివరి వారం వరకు ముగుస్తాయి. గతంలో పంచాయతీ ఎన్నికల తర్వాత పార్లమెంట్, స్థానిక సంస్థలు, (ఎంపీటీసీ, జెడ్పీటీసీ), మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’
సహారా గ్రూప్ సంస్థల ఛైర్మన్ సుబ్రతారాయ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సహారా గ్రూప్ నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణ జరుపుతోంది. రాయ్ మరణంతో ఆ దర్యాప్తు పరిస్థితికి సంబంధించి బాధితుల్లో ఆందోళన మొదలైంది. దాంతో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ సమాధానమిచ్చారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)సహా కంపెనీల చట్టం కింద చేస్తున్న మరే ఇతర విచారణలైనాసరే ఎవరో ఒకరు చనిపోయారని ఆగబోవు అంటూ సోమవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నవంబర్ 14న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మరణించిన నేపథ్యంలో ఈ మేరకు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 2018 అక్టోబర్ 31న సహారా గ్రూప్‌నకు చెందిన సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా క్యూ షాప్ యూనిక్ ప్రోడక్ట్స్ రేంజ్ లిమిటెడ్, సహారా క్యూ గోల్డ్ మార్ట్ లిమిటెడ్ సంస్థలపై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 7న సహారా గ్రూప్‌నకే చెందిన మరో ఆరు సంస్థలపై దర్యాప్తులకు ఆదేశించినట్టు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కేసులో సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లను ఉద్దేశించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అనుసరిస్తుందని, కోర్టు ఆదేశాల మేరకే బాధితులకు రిఫండ్ జరుగుతుందని తెలియజేశారు. ఇదీ చదవండి: ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..! ‘డ్రాగన్’ కంపెనీలపై.. దేశంలో 53 చైనా సంస్థలున్నాయని లోక్‌సభకు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. అయితే ఈ సంస్థలు యాప్‌ల ద్వారా రుణాలస్తూ వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయా? లేదా అనే అంశం గురించి మాత్రం సమాచారం లేదని చెప్పారు. ఇక ఈ ఏడాది మే నెలలో సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీ-పేస్)ను ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి దేశంలో 7,700లకుపైగా కంపెనీలు స్వచ్చంధంగా తమ వ్యాపారాలను మూసివేశాయని తెలిపారు. -
‘మహువా’ పై వేటు క్రికెట్లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మహిళా ఎంపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆసక్తికరంగా స్పందించారు. మహువాను బహిష్కరించడాన్ని క్రికెట్లో టైమ్ అవుట్ పద్ధతితో పోల్చారు. ‘మహువాపై ఒక ఫిర్యాదు వచ్చింది.దీనిపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. అనంతరం ఆమెను బహిష్కరించారు. ఇదంతా చూస్తుంటే విచారణ ఏదో కంటి తుడుపు చర్యలా కనిపిస్తోంది’ అని కార్తీ వ్యాఖ్యానించారు. ‘రెండువారాల క్రితం వరల్డ్ కప్ జరిగింది.అందులో ఒక మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్‌ను బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ టైమ్ అవుట్ చేశాడు.ఇది ఆట నిబంధనల్లో భాగమే కావచ్చు. కాని దీనిని క్రికెట్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆట స్ఫూర్తికి విరుద్ధమని వారంతా అభిప్రాయపడ్డారు. మహువా విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ఒంటరి మహిళను అవమానించారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. ఆమెను మళ్లీ భారీ మెజారిటీతో లోక్‌సభకు పంపిస్తారు’అని కార్తీ చెప్పారు. కాగా, పార్లమెంట్లో అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా నగదు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను హీరానందానికి ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మహువాపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఆమెపై విచారణకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. విచారణజరిపిన ఎథిక్స్ కమిటీ మహువానున లోక్‌సభ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది.ఈ సిఫారసును లోక్‌సభ శుక్రవారం వాయిస్ ఓట్‌తో ఆమోదించడంతో మహువా సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీచదవండి..ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం -
ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్‌సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్‌సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు. ఆయన వచ్చిన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్‌కు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు సాదర స్వాగతం పలికారు. మిఠాయిలు పంచుకున్నారు. మొత్తానికి రాహుల్ రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో పండుగ వాతావరణం కనిపించింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై త్వరలో పార్లమెంట్లో చర్చ, ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో రాహుల్ మళ్లీ ఎంపీగా సభకు రావడం తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఆశాభావం వ్యక్తం చేసింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ‘ఇండియా’ కూటమిలో హర్షం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతోపాటు దేశ ప్రజలకు ఇదొక ఊర ట అని పేర్కొన్నారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ రాక పట్ల విపక్ష ‘ఇండియా’ కూటమిలోని పలు పార్టీల అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ దోష విముక్తుడు కాలేదు: బీజేపీ రాహుల్ గాంధీ దోషం నుంచి ఇంకా పూర్తిగా విముక్తుడు కాలేదని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే మాత్రమే ఇచి్చందని గుర్తుచేశారు. కేసు గుజరాత్ కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిందని సుశీల్ కుమార్ మోదీ వివరించారు. ఆయన మళ్లీ లోక్‌సభకు వచి్చనప్పటికీ ప్రజలకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై నేడు చర్చ కేందంప్రై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు చర్చ జరుగుతుందని అంచనా. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిస్తారు. -
ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం
న్యాయమూర్తి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై సంతకం పెట్టిన వెంటనే ‘అనర్హత’ అమల్లోకి వచ్చేస్తుందని మాజీ అటార్నీ జనరల్ ఒకరు అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో రెండేళ్ల జైలుశిక్ష పడగల ఐపీసీ సెక్షన్ 153(ఎ), సెక్షన్ 505 పరీక్షకు ఎంతమంది రాజకీయ నేతలు నిలబడగలరు? ఈ రెండు సెక్షన్లూ దేని గురించో తెలుసా? మతం, భాషల ఆధారంగా సమాజంలో శత్రుత్వాన్ని పెంపొందించడం! కాబట్టి,కొంతమంది ఎంపీలను ఎంపిక చేసుకుని మరీ సభ్యత్వాలను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు? ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే ప్రతిపక్షం తప్పనిసరి అన్నది గుర్తుంచుకోవాలి. పరువునష్టం కేసుల విషయంలో చట్టాలను సమీక్షించేందుకు ఇదే సరైన తరుణం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయిపోయింది. న్యాయపరంగా, రాజకీయంగా దీని పరిణామాలు ఎలా ఉండనున్నాయన్న ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చలా మణీలో ఉన్న ప్రశ్నలతోపాటు సభ్యత్వ రద్దుతో రాగల ముఖ్యమైన సరికొత్త సందేహాలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. స్థూలంగా చెప్పాలంటే, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏమిటన్నది తరచిచూద్దాం. సూరత్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మార్చి 23న పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.15,000 జరిమానా విధించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 499, 500ల కింద దోషిగా నిర్ధారించారు. శిక్ష అమలును నెల రోజుల పాటు స్తంభింపజేసి, పైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా బెయిల్ ఇచ్చారు. అయితే న్యాయమూర్తి తీర్పు వెలువరించిన మరుసటి రోజే లోక్‌సభ కార్యాలయం రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళ నలకు దిగిన విషయం తెలిసిందే. ఇందుకు బదులు కాంగ్రెస్ నేతలు శిక్ష రద్దును కోరుతూ పైకోర్టును ఆశ్రయించి ఉండాల్సింది. ఈ సమస్యకు పరిష్కారం న్యాయస్థానాల్లోనే లభిస్తుంది కానీ వీధుల్లో కాదు. పైకోర్టులు శిక్షను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వల్ల మాత్రమే రాహుల్ గాంధీ మళ్లీ లోక్‌సభ సభ్యుడు కాగలరు. 2013 నాటి లిలీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైనా ఒక కేసులో శిక్ష ప్రకటించిన వెంటనే లోక్‌సభ సభ్యత్వం దానంతటదే రద్దయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సహా దాదాపు 20 మంది తమ సభ్యత్వాలను కోల్పోయిన విషయం ప్రస్తావనార్హం. లోక్‌సభ కార్యాలయం తొందరపాటు? రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేసే విషయంలో లోక్‌సభ కార్యాలయం తొందరపడిందా? మాజీ అటార్నీ జనరల్ ఒకరు చెప్పిన దాని ప్రకారం, లోక్‌సభ కార్యాలయానికి ఇంతకు మించిన ప్రత్యా మ్నాయం లేదు. న్యాయమూర్తి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై సంతకం పెట్టిన వెంటనే ‘అనర్హత’ అమల్లోకి వచ్చేస్తుందని తెలిపారు. అయితే లక్షద్వీప్ ఎంపీ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలపై కేరళ కోర్టు ఒకటి మహమ్మద్ ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు రోజుల తరువాత ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లక్షద్వీప్ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ 2023 జనవరి 18న ప్రకటించింది కూడా. అయితే వారం రోజుల తరువాత కేరళ హైకోర్టు మహమ్మద్ ఫైజల్ శిక్షపై స్టే విధించింది. దీంతో సుప్రీంకోర్టు ఉప ఎన్నికను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జనవరి 25 నుంచి మార్చి 29వ తేదీ వరకూ మహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడం! ఉన్నత న్యాయ స్థానం శిక్షపై స్టే విధించిన వెంటనే లోక్‌సభ్య సభ్యత్వం దానంతటదే పునరుద్ధరింపబడుతుందా, లేదా అన్న స్పష్టత మాజీ అటార్నీ జన రల్ ఇవ్వలేకపోయారు. (అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చేందుకు కొన్ని గంటల ముందు ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే.) చట్టాల్లోని ఈ లోపం ఎంపిక చేసిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్న వాదన ఉంది. కోర్టుల తీర్పుల అమలును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాదా? 2018లో ఎన్నికల కమిషన్ , లోక్ ప్రహరీ మధ్య జరిగిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ... అప్పీలు పెండింగ్‌లో ఉండి ఉన్నత న్యాయస్థానాలు శిక్షపై స్టే విధిస్తే, శిక్ష పరిణామంగా అమల్లోకి వచ్చే సభ్యత్వ రద్దు పనిచేయదని విస్పష్టంగా తెలిపింది. రాహుల్ కేసులో ఎన్నో సందేహాలు... రాహుల్ గాంధీపై సూరత్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన కేసుపై ఎన్నో సందేహాలున్నాయి. కేసు పిటిషనర్ గత ఏడాదే హైకోర్టు నుంచి విచారణపై ఎందుకు స్టే తెచ్చుకున్నారన్నది ఒక ప్రశ్న. దీని ఫలితంగా కేసు విచారణ దాదాపు 12 నెలల పాటు ఆలస్యమయ్యేందుకు పిటిష నర్ కారణమయ్యారు. అదనపు సాక్ష్యాలేవీ వెలుగులోకి రాని నేపథ్యంలో ఈ ఏడాది స్టే ఎత్తేయించుకునేందుకు ఏ రకమైన పరిణామాలు కారణమాయ్యాయన్నదీ అస్పష్టమే. పైగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సూరత్ కోర్టు మేజిస్ట్రేట్ ఎందుకు మారారు? కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ డిఫమేషన్ కిందకు వస్తాయా? లేక సివిల్ డిఫమేషన్ పరిధి లోకా? 2019 ఏప్రిల్ 13న ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాహుల్ అన్నది ఇదీ: ‘‘ఒక చిన్న ప్రశ్న... ఈ దొంగలందరి ఇంటిపేర్లు మోదీ, మోదీ, మోదీ అనే ఎందుకుంది? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ...’’ ఈ వ్యాఖ్య పైనే పరువు నష్టం కేసుల్లో గరిష్ఠంగా విధించ గల రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చా? పార్లమెంటు సభ్యత్వం రద్దయ్యేందుకు కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడాలన్నది ఇక్కడ కాకతాళీయమేనా? అన్నింటికంటే ముఖ్యంగా మనలాంటి దేశంలో, విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో రెండేళ్ల జైలుశిక్ష పడగల ఐపీసీ సెక్షన్ 153(ఎ), సెక్షన్ 505 పరీక్షకు ఎంతమంది రాజకీయ నేతలు నిలబడగలరు? ఈ రెండింటిలో దేని కిందనైనా శిక్ష పడితే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 కింద చట్టసభల సభ్యత్వం రద్దయిపోతుంది. ఈ రెండు సెక్షన్లూ దేని గురించో తెలుసా? మతం, భాషల ఆధారంగా సమాజంలో శత్రుత్వాన్ని పెంపొందించడం! కాబట్టి, కొంతమంది ఎంపీలను ఎంపిక చేసుకుని మరీ వారి సభ్యత్వాలను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు? అధికార పక్షంలో ఉంటూ పైన చెప్పిన సెక్షన్ల పరిధిలోకి రాగలవారిని చూసీచూడనట్లు వదిలేయడం ఎందుకు? అధికార పక్షం స్వయంగా చెబుతున్నట్లుగా చట్టం అందరికీ సమానమే, అందరూ చట్టం ముందు సమానులే కావాలి కదా? సమీక్షకు ఇదే తరుణం... నా దృష్టిలో పరువునష్టం కేసుల విషయంలో చట్టాలను సమీక్షించేందుకు ఇదే సరైన తరుణం. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, శ్రీలంక తదితర దేశాల్లో ఇప్పటికే పరువు నష్టం దావాల ‘డీక్రిమినలైజేషన్ ’ జరిగింది. ఆయా దేశాల్లో ఇప్పుడు పరువు నష్టం అనేది క్రిమినల్ నేరం కాదు. భారత్ కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. చివరిగా ఇకపై ఇలాంటి వ్యవహారాలు తగిన పద్ధతి ఆధారంగా న్యాయస్థానాల ద్వారా మాత్రమే జరగాలి. సభ్యత్వ రద్దుపై తీర్పు అనేది వీధుల్లో చర్చించే అంశం కానే కాదు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వ రద్దు తాలూకు రాజకీయ పరిణామాలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తెలుస్తున్నాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయన్నది వేచి చూడాల్సిన అంశం. ఇంకో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. న్యాయపరంగా లేదా రాజకీయాల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అందరూ అంగీకరించా ల్సిన విషయం ఒకటి ఉంది... ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే ప్రతిపక్షం తప్పనిసరి అన్నది అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షా లను చంపేసే ప్రయత్నాలకు ఫుల్స్టాప్ పడాల్సిందే! ఎస్.వై. ఖురేషీ వ్యాసకర్త కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
బెంగాల్ మంత్రులకు కేంద్రమంత్రి చురకలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ పశ్చిమ బెంగాల్ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లకు 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరని తెలిపారు. బెంగాల్లో పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పీఎం దక్ష్ పథకాన్ని అమలు చేయాలని, ఈ విషయంపై అధికారులతో మాట్లాడుతారా? అని బెంగాల్ బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా పార్లమెంటులో మంగళవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ మంత్రుల ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అయినా పట్టించుకోరని, వాళ్ల సిబ్బంది కూడా ఇతరులకు మంత్రుల ఫోన్ నంబర్ ఇవ్వాలంటేనే భయపడతారని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేనప్పుడు పథకాల అమలు ఎలా సాధ్యమవుతుందన్నారు. బెంగాల్ బర్హంపోర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లోకసభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ముర్షీదాబాద్ జిల్లా అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఫోన్లు ఎత్తకపోవడం, ఇతరులు చెప్పేది పట్టించుకోకపోవడం టీఎంసీ నేతలకు అలవాటే అన్నారు. దీనికి స్పందిస్తూ ముర్షీదాబాద్ జిల్లాలోని వికలాంగులు, సీనియర్ సిటిజెన్లకు రూ.12 కోట్లు విలువచేసే ఉపకరణాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రతిమా చేప్పారు. 16వేల మందికి వీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తమకు రాష్ట్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ లోక్‌సభలోని టీఎంసీ సభ్యులు నిరసనకు దిగారు. చదవండి: నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి -
కెనడా పార్లమెంట్లో కన్నడలో ప్రసంగం! వైరల్
మాతృభాష కనుమరుగైపోతుంది.. మాతృభాషలో మాట్లాడాలి.. ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను విస్మరించవద్దు.. అంటూ రకరకాల స్పీచ్‌లతో హోరెత్తించడం చూశాం. కేవలం మాతృభాష దినోత్సవం రోజున మాత్రమే ఈ మాతృభాష మీద ప్రేమ ఉప్పొంగుతుందే తప్ప తర్వాత షరా మాములే. కానీ ఒక కెనడా ఎంపీ పార్లమెంట్లో తన మాతృభాష కన్నడలో ప్రసంగించి ఔరా అనిపించుకున్నాడు. అంతేకాదు మాతృభాషకు ఇవ్వాల్సిన గౌరవం ఇది అని గొంతెత్తి చెప్పాడు. వివరాల్లోకెళ్తే....కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంట్లో కన్నడలో మాట్లాడి పలువురి హృదయాలను గెలుచుకున్నారు. ఈ మేరకు ఆయన కెనడా పార్లమెంట్లో మాట్లాడుతూ...భారతదేశం వెలుపల ప్రపంచంలోని ఏ పార్లమెంట్లోనైనా కన్నడ మాట్లాడటం ఇదే మొదటిసారి. కెనడా పార్లమెంట్లో తన మాతృభాష కన్నడలో ప్రసంగించటం చాలా ఆనందంగా ఉంది. ఐదు కోట్ల మంది కన్నడిగులకు ఇది గర్వకారణం. అని చెప్పారు. అంతేకాదు కవి కువెంపు వ్రాసిన గీతాన్ని స్వరపరిచిన డాక్టర్ రాజ్‌కుమార్ పాటలోని “ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ కన్నడిగే” అంటూ ఆయన ఆ ప్రసంగాన్ని ముగించారు. చంద్ర ఆర్య కెనడా పార్లమెంట్‌కి 2015లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2019లో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్నారయ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. I spoke in my mother tongue (first language) Kannada in Canadian parliament. This beautiful language has long history and is spoken by about 50 million people. This is the first time Kannada is spoken in any parliament in the world outside of India. pic.twitter.com/AUanNlkETT — Chandra Arya (@AryaCanada) May 19, 2022 (చదవండి: అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్) -
దైవసాక్షిగా.. ప్రమాణస్వీకారం చేసిన జిల్లా ఎంపీలు
సాక్షి, తిరుపతి: జిల్లా నుంచి గెలుపొందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు సోమవారం లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో మూడు ఎంపీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం తెలిసిందే. ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా అక్షర క్రమంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులకు అవకాశం వచ్చింది. అందులో జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, దుర్గాప్రసాద్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.వీరిలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రెండోసారి ఎంపీగా పోటీచేసి భారీ ఆధిక్యతతో గెలుపొందారు. రెడ్డెప్ప, దుర్గాప్రసాద్ మొదటిసారిగా పార్లమెంట్‌కు పోటీచేసి విజయం సాధించారు. వీరిద్దరు సోమవారం మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లోకసభా పక్షనేతగా ఎంపికైన విషయం విదితమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ 3 ఎంపీ స్థానాలతో పాటు 13 శాసనసభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. కుప్పం మెజారిటీతో చిత్తూరు పార్లమెంట్‌ను దక్కించుకుంటూ వస్తున్న టీడీపీకి ఈ సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబుకు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో కుప్పంలోనూ వైఎస్సార్సీపీకి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు పార్లమెంటు స్థానం కూడా వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. -
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) భారీ షాక్ ఇచ్చింది. యూపీఏ-2 ప్రభుత్వం(2009లో) నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి గస్తీ విమానాలను కోనుగోలు చేసిందని వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. పొసేడియన్ పీ-8ఐ సముద్ర గస్తీ విమానాలకు ఆహ్వానించిన టెండర్లను ఖరారు చేయడంలో యూపీఏ ప్రభుత్వం, రక్షణ శాఖ పొరపాటు చేశాయని కాగ్ తెలిపింది. 8 నిఘా విమానాల కోసం బోయింగ్ సంస్థ రూ.8,700 కోట్లు బిడ్డింగ్ వేయగా, యూరప్ కు చెందిన ఈఏడీఎస్ సంస్థ కేవలం రూ.7,776 కోట్లకే ఎనిమిది ఏ-139 విమానాలను సరఫరా చేస్తామని ముందుకు వచ్చిందని వెల్లడించింది. రాబోయే 20 ఏళ్లకు ఈ విమానాలకు అందించాల్సిన సర్వీసింగ్ ఖర్చుల్ని ఈఏడీఎస్ బిడ్డింగ్ కు కలిపేసిన రక్షణ శాఖ.. బోయింగ్ కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చిందని ఆక్షేపించింది. తద్వారా ఈఏడీఎస్ బిడ్డింగ్ ఖర్చు రూ.8,712 కోట్లకు చేరుకుంది. దీంతో బోయింగ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుందని వెల్లడించింది. బోయింగ్ నుంచి కొనుగోలు చేసిన పీ-8 నిఘా విమానాలకు మూడేళ్ల పాటు సర్వీసింగ్ కు ప్రత్యేకంగా మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని పేర్కొంది. సముద్రంపై నిఘాతో పాటు శత్రు దేశాల సబ్ మెరైన్లను వేటాడేందుకు మరో నాలుగు లాంగ్ రేంజ్ పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలుకు 2013-15లో భారత నేవీ బోయింగ్ తో ఒప్పందం కుదుర్చుకుందని కాగ్ వివరించింది. -
లోక్‌సభలో చర్చకు నోచుకోని అవిశ్వాస తీర్మానాలు
-
హోదా తీర్మానానికి మద్దతుగా జగన్ మానవహారం
-
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షం పోరాటం ఉద్ధృతం
-
ఉధృతమవుతున్న ప్రత్యేక హోదా పోరు
-
పార్లమెంట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఎంపీల ధర్నా
-
నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయసభలు
-
హామీల అమలుపై వైఎస్ఆర్సీపీ ఎంపీల నిరసన
-
ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చండి
-
కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది
-
ముంబై ప్రమాదంపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబయి : బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని ముంబయి అగ్ని ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో అగ్ని ప్రమాదానికి కారణం జనాభా అన్నారు. ముంబయిలోకి పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ముంబయిలోని కమలామిల్స్ కాంపౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని 14మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులతో హేమమాలిని పార్లమెంటు వెలుపల మాట్లాడుతూ 'పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదు. వారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. కానీ, ముంబయిలో విపరీతంగా జనాభా ఉంది. ముంబయి ముగిశాక మరోనగరం ప్రారంభం కావాలి. అంతేగానీ, ఈ నగరంలో ఇంకా విస్తరిస్తూనే ఉంది.. నియంత్రణ లేకుండా పోతోంది. ప్రతి నగరానికి జనాభా విషయంలో కొంత పరిమితి అంటూ ఉండాలి. పరిమితి దాటాక ఎవరినీ అనుమతించకూడదు. వారిని వేరే నగరానికి వెళ్లిపోనివ్వాలి... అక్కడ నుంచి మరో నగరానికి వెళ్లనివ్వాలి' అని హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
‘ఆ మంత్రిని తీసేస్తేనే సభలో కూర్చుంటాం’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, అందుకే తాము అధికారంలోకి వచ్చామని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్రాన్ని నిలదీశారు. సదరు మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అలా చేస్తేనే తాము సభను జరగనిస్తామని, సభలో కూర్చుంటామని స్పష్టం చేశారు. అటు లోక్‌సభతోపాటు రాజ్యసభ కూడా ఇదే విషయం పెద్ద ధుమారంగా మారింది. త్వరలోనే రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) అనే పదాన్ని తొలగిస్తామని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనంతకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలు రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తికి సభలో కూర్చునే అర్హతే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆజాద్ అన్నారు. ఇక రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడి పోడియం చుట్టూ చేరిన సభ్యులు ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు జరిగిన అవమానం అని నినాదాలు చేశారు. ఇలాంటి వాటిని మరోసారి జరగనివ్వకూడదని వెంటనే దీనిపై కేంద్రం స్పందించి కేంద్రమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్రం మాత్రం ఈ వివాదం నుంచి పక్కకు జరిగింది. అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ప్రభుత్వానికి ఆయన మాటలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కేంద్రమంత్రి విజయ్ గోయెల్ రాజ్యసభలోలో మాట్లాడుతూ ప్రభుత్వానికి అనంతకుమార్ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. మరోపక్క, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ హెగ్డే వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేశామని, సమావేశాలు మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నాయని, తాను ప్రతిపక్షం ఈ విషయం అర్ధం చేసుకొని సభలోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. -
పార్లమెంట్ సాక్షిగా టీడీపీ డబుల్ గేమ్
ఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా టీడీపీ మరోసారి డబుల్ గేమ్ ఆడుతోంది. ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు లోపల, తెలంగాణ ఎంపీలు బయట ఆడుతున్న డ్రామా రసవత్తరంగా సాగుతోంది. పార్లమెంట్ ఉభయసభల్లో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సమైక్య నినాదాలు చేస్తున్నారు. పార్లమెంట్ బయట రాష్ట్ర విభజన బిల్లు కోసం తెలంగాణ టీడీపీ నేతలు పట్టుపడుతున్నారు. ఒకే పార్టీ రెండు వాదనలతో డబుల్ గేమ్ ఆడుతోంది. -
తదుపరి సమావేశాల్లో తెలంగాణ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో పెడుతుందని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ బిల్లుతోపాటు మత హింస నిరోధక బిల్లును కూడా వచ్చే సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు తెస్తామని పేర్కొన్నారు. అయితే సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపడం, ఆయన నుంచి బిల్లు అభిప్రాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్లడం, ప్రస్తుతం బిల్లు అసెంబ్లీలో ఉండటం తెలిసిందే. మత హింస నిరోధక బిల్లును బుధవారంతో ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెట్టడానికి కేంద్రం ప్రయత్నించి విఫలమైంది. ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
టీడీపీ ఎంపీలవి రాజీ‘డ్రామా’లే..
సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేశామని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల అసలు రంగు మరోసారి బట్టబయలైంది. టీడీపీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలు ఉత్తుత్తి డ్రామానే అని తేలిపోయింది. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న అనుమానాలకు బలం చేకూరింది. కొద్ది రోజులుగా రాజీనామాలపై హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు ఇప్పుడు ఆ రాజీనామాల ఆమోదం అగ్నిపరీక్షగా మారింది. సీమాంధ్రకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామా వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆయా ఎంపీల రాజీనామాల అసలు గుట్టు బయటపడింది. కొందరు ఎంపీలైతే అసలు రాజీనామాలే సమర్పించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేశారన్న విషయం తేలిపోయింది. సీమాంధ్ర ప్రాంతం నుంచి రాజీనామాలు సమర్పించిన వారుగా.. పది మంది కాంగ్రెస్ (ఎస్.పి.వై.రెడ్డితో కలిపి), ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్, ఒకే ఒక్క టీడీపీ ఎంపీ పేర్లు మాత్రమే స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌లో ఉన్నాయి. వీరిలో సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క మంత్రి పేరూ లేదు. అలాగే రాజీనామాలు సమర్పించిన ఎంపీల వైఖరిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో తనను వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ ఆయా ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇలా కలిసినప్పుడు వారు స్పీకర్ ముందు ఏం చెప్తారన్నది చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇచ్చే తీర్పుననుసరించి.. రాజీనామాలపై కాంగ్రెస్ ఎంపీల్లోనూ ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు? ఎంతమంది డ్రామాలాడుతున్నారు? అన్న అంశం కూడా కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశముంది. అసలు రాజీనామాలే పంపలేదా..? రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలన్న డిమాండ్ అన్ని వైపుల నుంచి బలంగా వినిపించింది. ఈ విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో అత్యధికులు మొదటి నుంచి హైడ్రామా నడిపిస్తూ వచ్చారు. టీడీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు చేసిన రాజీనామాలు బూటకమని అధికారికంగా తేలిపోయింది. సోమవారం లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న 13 మంది ఎంపీల్లో టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం) ఒక్కరి పేరు మాత్రమే ఉండటం దీనికి సాక్ష్యం. జూలై 30న సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు నాలుగైదు లక్షల కోట్లు అవసరమవుతాయని తమ పార్టీ నేతలు అంచనా వేశారని, ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన చంద్రబాబు నివాసంలోనే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి గంట ముందు రాజ్యసభ సభ్యుడు వై.సత్యనారాయణచౌదరి కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించటాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ సభ్యులు వై.సత్యనారాయణచౌదరి, సి.ఎం.రమేష్‌లతో పాటు లోక్‌సభ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి ఉన్నారు. వీరంద రూ తమ రాజీనామా పత్రాలను ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబుకు చూపించగా.. వాటిని లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు అందచేయాలని సూచించారు. ఆ మేరకు టీడీపీ ఎంపీలంతా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వారిలో లోక్‌సభ సభ్యులు మోదుగుల, నిమ్మల కిష్టప్ప, ఎన్.శివప్రసాద్‌లు తమ రాజీనామా లేఖలను అసలు స్పీకర్ కార్యాలయానికి గానీ లేదా లోక్‌సభ సచివాలయానికి గానీ పంపలేదు. కొనకళ్ల మాత్రం రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. తాజాగా స్పీకర్ కార్యాలయం నుంచి విడుదలైన బులెటిన్‌తో మిగిలిన ఇద్దరు ఎంపీలు రాజీనామా లేఖలే పంపలేదన్న విషయం బయటపడింది. ముందే బయటపెట్టిన హరికృష్ణ టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ ఉత్తుత్తి రాజీనామాలేనని అదే పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మొద ట్లోనే బయటపెట్టారు. ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా ఆగస్టు 2వ తేదీనే రాజీనామా చేసినట్టు టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రకటించారు. అయినా పార్లమెంటు సమావేశాలకు హాజరై నానా హడావుడి చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒక ఎంపీ అయితే విజయ్చౌక్లోని మీడియా పాయింట్ వద్ద చెర్నకోలతో శరీరంపై కొట్టుకున్నారు. రకరకాల వేషాలు ప్రదర్శించారు. ఈ ఎంపీల డ్రామా నడుస్తుండగానే రాజీనామా ఎందుకు ఆమోదం పొందడం లేదో తెలుకోవడానికి స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన హరికృష్ణకు టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ సరిగా లేవని, ఉత్తుత్తి రాజీనామాలని తెలిసి షాకయ్యారు. దాంతో ఆయన వెనువెంటనే మరో రాజీనామా లేఖను అక్కడికక్కడే అందజేసి ఆమోదించాలని స్పీకర్‌ను కోరి మరీ తన రాజీనామాను ఆమోదింపచేసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప తాము రాజీనామా చేశామని చెప్పుకుంటూ ఇంతకాలం హైడ్రామా నడిపారు. దాంతో వీరు సమర్పించిన రాజీనామా సరైనపద్ధతిలో లేవని, అవి ఉత్తుత్తి రాజీనామాలేనని హరికృష్ణ మీడియా ముందు బయటపెట్టారు. అయినప్పటికీ వీరు కిమ్మనకుండా యథావిధిగా తమ డ్రామాను కొనసాగించారు. పార్లమెంటు సమావే శాలు ప్రారంభమైన రోజు నుంచి పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే మకాం వేసి ప్రతి రోజూ మీడియా ముందు మాట్లాడుతూ రెండు నెలలుగా హడావుడి చేశారు. తాజాగా స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఒక్క కొనకళ్ల నారాయణ రాజీనామా పత్రం మినహా మిగిలినవి ఏవీ సభాపతి వద్దకు చేరలేదని, లేదా అసలు అవి స్పీకర్ ఫార్మాట్లో లేవని బయటపడింది. ఇక టీడీపీ రాజ్యసభ సభ్యులదీ అదే దారి. పార్టీ రాజ్యసభ సభ్యులు సుచనాచౌదరి, సి.ఎం.రమేష్‌లు రాజీనామాలను చైర్మన్‌కు పంపించామని ఆర్భాటంగా ప్రకటనలు చేసినా ఇంతవరకు వాటిని ఆమోదించాలని ఏ రోజూ రాజ్యసభ చైర్మన్‌ను కలిసి కోరలేదు. కోరివుంటే హరికృష్ణ రాజీనామా ఆమోదించిన తరహాలోనే వీరి రాజీనామా కూడా ఆమోదం పొందేది. వీరు తమ రాజీనామా ఆమోదానికి ఏమాత్రం సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ కేంద్ర మంత్రుల హైడ్రామా... మరోవైపు కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల తీరు కూడా ఇలాగే ఉంది. రాజీనామా డిమాండ్ వచ్చినప్పుడు పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని, సీమాంధ్ర వాణిని వినిపిస్తామని చెప్తూ కొంత కాలం డ్రామా నడిపిన ఎంపీలు ఆ తర్వాత తాము రాజీనామా చేశామని ప్రకటించుకున్నారు. అలాగే మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగుతూ విభజనపై కేంద్రం ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటామని పలువురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూవచ్చారు. అసలు కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రాకుండా చూస్తామని ప్రక టించారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన అంశంపై ఆంటోనీ నేతృత్వంలో కమిటీ నియమిస్తే అది తమ ఒత్తిడి వల్లనేనని చెప్పుకొచ్చారు. ఆంటోనీ కమిటీ సభ్యులు రాష్ట్రంలో పర్యటించి అందరితో చర్చిస్తారని, ఆ కమిటీ నివేదిక ఇవ్వకండా తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రాదని రకరకాల ప్రకటనలతో గంద రగోళపరిచారు. కానీ వారి మాటలకు జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకుండా పోయింది. కమిటీ రాష్ట్రంలో పర్యటించలేదు సరికదా ఢిల్లీలోనూ రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్యమైన వర్గంతోనూ మాట్లాడిన పాపాన పోలేదు. కేవలం మొక్కుబడిగా కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలతో చర్చలకే పరిమితమైంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వకుండానే తెలంగాణ నోట్ రూపొందడం, దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ కేంద్రమంత్రులకు తెలిసే జరిగినా తమకు ఏమీ తెలియకుండానే జరిగిపోయినట్లుగా మంత్రులు ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు. వారివీ ఉత్తుత్తి రాజీనామాలే..! ఇక మరి కొందరు కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేశామని బయటకు చెప్తున్నప్పటికీ అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. రాజీనామాలు చేశామని ప్రకటించి ఆ మేరకు స్పీకర్‌కు లేఖలు అందించామని కొందరు చెప్తే.. పార్లమెంటు కార్యాలయంలో సమర్పించామని, ఫ్యాక్స్ ద్వారా పంపించామని మరికొందరు ప్రకటించారు. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమైన రాజీనామాలు, ఎన్ని ఉత్తుత్తి రాజీనామాలు అన్న అంశంపై ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు, సీమాంధ్ర కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలకు, కేంద్రం తెలంగాణపై వేస్తున్న అడుగులకు పొంతన లేకపోవటంతో రాజీనామాలపై వారు చేస్తున్న ప్రకటనలు కూడా ఉత్తుత్తివేనన్న అభిప్రాయం ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో పాతుకుపోయింది. తాజాగా సోమవారం స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆ విషయం మరింతగా స్పష్టమవుతోంది. స్వచ్ఛందంగానే చేశామని చెప్తారా..? ఇంతకాలం స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో రాజీనామాలు చేశామంటూ కొందరు ఎంపీలు హడావుడి చేశారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు రావటంతో.. వారు ఇరకాటంలో పడ్డారు. పలువురు ఎంపీలు దానినుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగతంగా స్పీకర్‌ను కలిసినా రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేలా స్పష్టత ఇవ్వకుండా ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తున్నామన్న వివరణ ఇవ్వాలనే వ్యూహంలో ఎంపీలు ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. రాజీనామాలు ఇచ్చామని పైకి చెప్పుకోవటానికి వీలుగా రాజీనామాలు తిరస్కారం కాకుండా స్పీకర్ వద్దనే పెండింగ్‌లో ఉండేలా వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. పలువురు ఎంపీలు తమ రాజీనామాలపై స్పష్టత ఇవ్వటానికి స్పీకర్‌ను మరికొంత గడువు కోరాలన్న ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.