న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్‌సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్‌సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు.
ఆయన వచ్చిన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్‌కు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు సాదర స్వాగతం పలికారు. మిఠాయిలు పంచుకున్నారు. మొత్తానికి రాహుల్ రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో పండుగ వాతావరణం కనిపించింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై త్వరలో పార్లమెంట్‌లో చర్చ, ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో రాహుల్ మళ్లీ ఎంపీగా సభకు రావడం తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఆశాభావం వ్యక్తం చేసింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
‘ఇండియా’ కూటమిలో హర్షం
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతోపాటు దేశ ప్రజలకు ఇదొక ఊర ట అని పేర్కొన్నారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ రాక పట్ల విపక్ష ‘ఇండియా’ కూటమిలోని పలు పార్టీల అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు.
రాహుల్ దోష విముక్తుడు కాలేదు: బీజేపీ
రాహుల్ గాంధీ దోషం నుంచి ఇంకా పూర్తిగా విముక్తుడు కాలేదని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే మాత్రమే ఇచి్చందని గుర్తుచేశారు. కేసు గుజరాత్ కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిందని సుశీల్ కుమార్ మోదీ వివరించారు. ఆయన మళ్లీ లోక్‌సభకు వచి్చనప్పటికీ ప్రజలకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
అవిశ్వాసంపై నేడు చర్చ
కేందంప్రై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు చర్చ జరుగుతుందని అంచనా. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment