ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ మరోమారు అవిశ్వాసతీర్మానం పెట్టనుంది. సోమవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. లోక్‌సభ సెక్రెటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవకు నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు రెండు సార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని కారణంగా.. మూడోసారి నోటీసులు ఇవ్వడం అనివార్యమైందని ఆ పార్టీ ఎంపీలు చెప్పారు.