జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి | increase the BC reservation on the basis of population | Sakshi
Sakshi News home page

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి

Published Wed, Apr 12 2017 6:57 PM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి - Sakshi

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచాలని టీడీపీ శాసనసభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ కమిషన్‌ సిఫార్సుల మేరకు ముస్లిం రిజర్వేషన్లు పెంచుతున్న ప్రభుత్వం.. బీసీల రిజర్వేషన్లు కూడా 52 శాతానికి పెంచాలన్నారు. ఎస్టీ జనాభా ప్రకారం వారి రిజర్వేషన్లు పెంచినప్పుడు బీసీల కోటా ఎందుకు పెంచరని ప్రశ్నించారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు ఆయన లేఖ రాశారు.

గతంలో బీసీ రిజర్వేషన్లు హెచ్చించినప్పటికీ జనాభా లెక్కలు లేని కారణంగా కోర్టు కొట్టేసిందని, తాజాగా 2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నందున ఆమేరకు పెంచాలన్నారు. అదేవిధంగా స్ధానిక సంస్థల్లోనూ బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లు పెంచితేనే బీసీలు అభివృద్ధి చెందుతారని కృష్ణయ్య లేఖలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement