సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సమావేశంలో బీసీల సమస్యలపై చర్చించి తయారు చేసిన 210 డిమాండ్ల ముసాయిదా తీర్మానాలను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు.
ఈ బడ్జెట్‌లో బీసీలకు రూ. 10 వేల కోట్లు కేటాయించాలని, రూ. 20 వేల కోట్లతో బీసీ ఉపప్రణాళిక ఏర్పాటు చేయాలని కోరారు. ఈనెల 10న హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్ హాల్‌లో బీసీ నాయ్యవాదుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. గుజ్జకృష్ణ, సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నీల వెంకటేశ్, నర్సింహాగౌడ్, రాజేందర్, భూపేస్‌సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment