చైనాలో పని చేసేవారి సంఖ్య 100 కోట్లు
Published Sun, Mar 12 2017 5:35 PM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
బీజింగ్: ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా గల దేశం చైనా. ప్రస్తుతానికి చైనాలో 138 కోట్ల జనాభా ఉంది. కానీ 2030 వరకు ఈ సంఖ్య 145 కోట్లకు చేరుతుందని, 2050లో 140 కోట్లకు పడిపోతుందని, ఈ శతాబ్ధం చివరకు క్రమంగా తగ్గుతూ 110 కోట్లకు చేరుతుందని చైనా అధికారులు వెల్లడించారు. చైనా జాతీయ కుటుంబ నియంత్రణ అధికారి వాంగ్ ప్యూన్ ఆదివారం ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు.
చైనాలో గత కొన్ని సంవత్సరాలుగా జనాభా పేరుగుదల తగ్గిందని, దీనికి కారణం చైనా జనాభా పెరుగుదల, అక్షరాస్యత పై ప్రత్యేక దృష్టి సారించడమేనని ప్యూన్ తెలిపారు. చైనా జనాభాలో పనిచేసేవారు 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్నారని, దేశంలో 100 కోట్ల మంది పని చేసేవారున్నారని చెప్పారు. ఇది జనాభాలో 75 శాతం అని, ఈ సంఖ్య 2020లో 98.5 కోట్లకు పడిపోనుందని, 2050 కల్లా 80 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఈ సంఖ్య అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చైనా మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికా జనాభాలో పనిచేసేవారు 66 శాతం, యూరప్‌లో 67 శాతం, జపాన్‌లో 61 శాతమని ప్యూన్ తెలిపారు. యూరప్, అమెరికాలో పని చేసేవారు సమారు 73కోట్ల జనాభా అని, ఇది చైనా 100 కోట్ల జనాభా కన్నా తక్కువని పేర్కొన్నారు. చైనాకు ఉత్పాదకత రేటు ఎక్కువగా ఉందని, జనాభా తగ్గుదలను టెక్నాలజీ భర్తీ చేస్తుందన్నారు.
గతేడాది చైనా దశాబ్ధం పాటు జనాభా నియంత్రణను సడలించదని, తోబుట్టువులు లేని జంటలకు రెండో బిడ్డను కనడానికి అనుమతిచ్చిందని తెలిపారు. దీంతో 2016లో 1.84 కోట్లమంది జన్మించారని, ఈ సంఖ్య గత జనాభా లెక్కలతో పోల్చితే 20 లక్షలు ఎక్కువగా ఉందన్నారు. చైనా ఇప్పటి నుంచి 2020 వరకు జననాల సంఖ్య ప్రతి ఏడాది 1.7 కోటి నుంచి 1.9 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తుందని వాంగ్‌ప్యూన్ తెలిపారు.
Advertisement