ఉప్పు.. తగ్గినా ముప్పే!
‘అతి సర్వత్ర వర్జయేత్’ అని సంస్కృతంలో నానుడి. ఏ విషయంలోనైనా అవసరానికి మించి వ్యవహరించకూడదంటారు. అయితే బీపీ వస్తుందని భయపడి చాలామంది ఉప్పు వాడకాన్ని తగ్గిస్తుంటారు. ఉప్పు వాడకం మరీ తగ్గినా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. 49 దేశాల్లోని దాదాపు 1.30 లక్షల మందిపై కెనడాకు చెందిన పాపులేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది.
రోజువారీ అవసరానికి మించి ఉప్పు తింటున్న వారు, అధిక రక్తపోటు ఉన్నవారే ఉప్పు వాడకం తగ్గించుకోవాలని యాండ్రూ మెంటే అనే శాస్త్రవేత్త పేర్కొంటున్నారు. ఉప్పు వాడకం తగ్గితే కొంతమేర రక్తపోటు తగ్గినా.. వేరే హార్మోన్ల మోతాదు పెరిగేందుకు కారణమై లాభం కన్నా నష్టమే ఎక్కువవుతుందని వివరించారు.