సాధారణంగా 100 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్స్ సరికొత్త రికార్డులను సృష్టించడం చూస్తూ ఉంటాం. ఉసేన్ బోల్ట్, టైసన్ గే వంటి ప్రపంచస్థాయి స్పింటర్లు ఎన్నో అరుదైన ఘనతలు తమ పేరిట లిఖించుకున్నారు. కానీ తాజాగా 100 మీటర్ల రేసులో ఒక రోబోడాగ్ చరిత్ర సృష్టించింది.
హౌండ్ అనే రోబో కుక్క 100 మీటర్ల రేసును కేవలం 19.87 సెకన్లలోనే పూర్తి చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డునను సాధించింది. ఈ రోబో గంటకు 11.26 మైళ్ల వేగంతో పరుగు పందెన్ని పూర్తి చేసింది.
ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డులకెక్కిన తొలి నాలుగు కాళ్ల రోబోగా హుండూ చరిత్రలోకి ఎక్కింది. ఈ రోబోను దక్షిణ కొరియాలోని డేజియోన్‌లోని కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన యంగ్-హా షిన్ రూపొందించారు. 45 కేజీల బరువున్న ఈ రోబో పరుగుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: WI vs ENG: చివరి ఓవర్‌లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్
Comments
Please login to add a commentAdd a comment