
కరోనా చికిత్స సమయంలో పేషెంట్ల పరిస్థితి ఒక్కసారిగా తిరగబడిన సందర్భాలు ఉంటున్నాయి. ఆ టైంలో అప్రమత్తం అయ్యే లోపే ప్రాణాల మీదకు వస్తోంది. ఈ తరుణంలో పేషెంట్ల ప్రాణాలను కాపాడగలిగే అత్యాధునిక సాంకేతికతను రూపొందించారు భారత సంతతికి చెందిన అనంత్ మాడభూషి.
ఓహియో క్లీవ్‌లాండ్‌లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో ‘కంప్యూటేషనల్ ఇమేజింగ్ అండ్ పర్సనలైజ్డ్ డయగ్నోస్టిక్స్’ ఎక్స్‌పర్ట్‌గా అనంత్ మాడభూషి. ఈయన డెవలప్ చేసిన ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొవిడ్ పేషెంట్లకు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడనుంది. కొవిడ్ పేషెంట్‌కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు.. ఈ ఏఐ టూల్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. పేషెంట్‌కు వెంటిలేటర్ అవసరమని సూచిస్తుంది. తద్వారా పేషెంట్ల ప్రాణాలు కాపాడొచ్చని ఆయన చెప్తున్నారు.
డీప్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీల సాయంతో ఈ టూల్‌ను రూపొందించారు ఆయన. అమెరికా, వుహాన్(చైనా)లో 2020లో నమోదు అయిన 900 మంది కొవిడ్ పేషెంట్ల సీటీ స్కాన్‌లను ఆధారం చేసుకుని ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. ‘‘ఈ టెక్నాలజీ.. కొవిడ్ 19 పేషెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఫిజిషియన్స్‌ను అప్రమత్తం చేస్తుంది. పేషెంట్‌కు, వాళ్ల కుటుంబ సభ్యులకు పరిస్థితి అప్‌డేట్ అందిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆస్పత్రికి ఎన్ని వెంటిలేటర్స్ అవసరం అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎర్లీ స్టేజ్‌లోనే గుర్తించి అప్రమత్తం చేస్తోందని, 84 శాతం సక్సెస్ రేటు చూపిస్తున్న ఈ టూల్‌ను త్వరలోనే వినియోగంలోకి తేనున్నామని పరిశోధకులు వెల్లడించారు. ముందుగా యూనివర్సిటీ ఆస్పత్రుల్లో, లూయిస్ స్టోక్స్ క్లీవ్‌లాండ్ వీఏ మెడికల్ సెంటర్‌లో వీటిని రియల్ టైంలో ఉపయోగించనున్నారు. క్లౌడ్ బేస్డ్ యాప్ఎమర్జన్సీ యూనిట్‌లకు వీటిని అనుసంధానిస్తారు.
చదవండి: డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్
Comments
Please login to add a commentAdd a comment