బెర్లిన్: కోవిడ్ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై తాము పరిశోధనలు చేశామని వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు మెదడు దెబ్బతినేందుకు సూచికలైన కొన్ని రసాయనాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోపాటు మెదడు నాడుల కొనలలో ఉండే ఎన్‌ఎఫ్‌ఎల్ అనే మరో ప్రొటీన్ కూడా రక్తంలో కనిపించిందని చెప్పారు. కోవిడ్ –19 కారణంగా వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన రోగుల్లో ఈ ఎన్‌ఎఫ్‌ఎల్ చాలా ఎక్కువగా కనిపించిందని, దీనికి వ్యాధి తీవ్రతకు సంబంధం ఉందన్న విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చునని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment